ఆంధ్రప్రదేశ్‌

సీమలో భానుడి నిప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 4 : రాయలసీమలో భానుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. సీమలోమార్చి 18వ తేదీ నుంచీ ఎండ మండుతోంది. అప్పటి నుంచీ ప్రతి రోజూ 40 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనంతపురంలో సోమవారం జిల్లా సగటు ఉష్ణోగ్రత 41.7 డిగ్రీలుగా నమోదయింది. అత్యధికంగా పుట్టపర్తిలో 46.7 డిగ్రీలు, జిల్లా కేంద్రమైన అనంతపురంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలోని సుమారు 80 పైగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లలో 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 43.1 డిగ్రీలుగా నమోదయింది. జిల్లాకేంద్రమైన కర్నూలులో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత, జిల్లా కేంద్రమైన కడపలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలోని 92 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ లలో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.

వడదెబ్బకు ఇద్దరు మృతి
అనంతసాగరం: మండుతున్న ఎండల తీవ్రత తట్టుకోలేక నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సోమవారం సోమశిలకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి కొండయ్య, అనంతసాగరం నడివీధికి చెందిన షేక్ మదరసా అనే వ్యక్తి ఎండ తీవ్రతకు వడదెబ్బతగిలి మరణించారు. కాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని నంద్యాల - గిద్దలూరు హైవేరోడ్డులో అటవీ డివిజన్ కార్యాలయం సమీపంలో సోమవారం 40 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బకు గురై మృతిచెందాడు.