ఆంధ్రప్రదేశ్‌

తెలుగు మీడియం రద్దు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 6:రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో తెలుగుమీడియం రద్దు చేయాలన్న నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేశారు. విద్యార్థులు, తల్లితండ్రులకూ కౌనె్సలింగ్ చేశాకే అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల్ వలవేన్ తెలిపారు. యుటిఎఫ్‌కు చెందిన ప్రతినిధులు వెలగపూడి సచివాలయంలో ఆయనను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా వలవేన్ మాట్లాడుతూ కొన్ని పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపేందుకు ఇంగ్లీషు అవసరమని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని ఏర్పాట్లు చేశాకే వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ నేత వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రెండు మీడియంలలో బోధన ఉండాలని, తప్పనిసరి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.