ఆంధ్రప్రదేశ్‌

మే నెలాఖరుకు భావనపాడు టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 4: శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టును ప్రైవేటురంగంలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం తుది దశకు చేరుకుంది. అనేక వడపోతల అనంతరం మూడు సంస్ధలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏప్రిల్ 30 నాటికి ఆర్థిక, సాంకేతిక బిడ్లు ఆహ్వానించి మే మొదటి వారంలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో 14 నాన్ మేజర్ పోర్టులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భావనపాడు పోర్టుకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ కోసం గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ప్రకటనతో 15 సంస్థలు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ నివేదికలు అందజేశాయి. దాదాపు రూ.3,500 కోట్లతో భావనపాడు పోర్టును పూర్తి స్థాయిలో నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ముందుకు వచ్చిన 15 సంస్థల సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం మూడు సంస్థలను ఎంపిక చేసింది. ఇప్పటికే పోర్టు నిర్వహణలో అనుభవం సంపాదించిన కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్, గంగవరం పోర్టు లిమిటెడ్‌తో పాటు అదానీ గ్రూపు సంస్థలు ప్రభుత్వం ఎంపిక చేసిన వాటిలో ఉన్నాయి. ఎంపిక చేసిన మూడు సంస్థల నుంచి ఆర్థిక, సాంకేతిక బిడ్లను కోరుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన సంస్థలు ఏప్రిల్ 30లోగా బిడ్లను సమర్పించాల్సి ఉంటుంది. భావనపాడు పోర్టు నిర్మాణానికి సంబంధించి గతంలోనే ప్రభుత్వం 4000 ఎకరాలు సేకరించాలని నిర్ణయించగా, తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో దీన్ని 2,500 ఎకరాలకు కుదించారు. భావనపాడు పోర్టు నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్రలోని వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశాల్లోని ఖనిజాల రవాణాకు ఉపయుక్తంగా ఉంటుంది. తొలి దశలో 5 బెర్తులతో చేపట్టి 14 బెర్తులకు విస్తరించాలన్నది ప్రణాళిక. ఇప్పటికే ఎంపికైన మూడు సంస్థలు భావనపాడు పోర్టు నిర్మించే ప్రాంతాన్ని సందర్శించి, ఒక అంచనాకు వచ్చాయి.