ఆంధ్రప్రదేశ్‌

మహిళ ఇళ్లల్లో ‘దీపం’ కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 7: మహిళా సంక్షేమం కోసం చంద్రబాబునాయుడి ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో ‘దీపం’ సత్ఫలితాలిస్తోంది. కట్టెల పొయ్యి కష్టాల నుంచి మహిళలను దూరం చేయడానికి గానూ ప్రభుత్వం దీపం పథకాన్ని అమలు చేస్తోంది. దారిద్య్రరేఖ దిగువున వున్న ప్రతి మహిళకూ గ్యాస్ కనెక్షన్ అందజేస్తోంది.2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు, ఈ రెండున్నరేళ్లలో 14,25,938 గ్యాస్ కనెక్షన్లను అందజేసి, తాను మహిళా పక్షపాతినని మరోసారి రుజువు చేసుకున్నారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని అధిగమించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. పొగ రహిత రాష్ట్రంగా నవ్యాంధ్రను తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించింది. అదే సమయంలో మహిళల వంటింటి కష్టాలు గట్టెక్కించడానికి ప్రభుత్వం దీపం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుత కంప్యూటర్ యుగంలోనూ ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్నారు. దీనివల్ల ఎందరో మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. మహిళ ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబునాయుడి ప్రభుత్వం దీపం పథకం పేరుతో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ అందజేస్తోంది. దీనివల్ల మహిళల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా, పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలు కలుగుతుంది. అందుకే సిఎం జన్మభూమి కార్యక్రమంలో దీపం పథకాన్ని ప్రత్యేక అంశంగా చేర్చారని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్హులైన మహిళలకు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను అందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సిఎంగా వున్నప్పుడు చంద్రబాబునాయుడు దీపం పథకాన్ని ప్రారంభించారు. 1999 జూలై నెలలో ఈ పథకాన్ని ఆయన పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి 2014 మార్చి వరకూ 16 ఏళ్లలో పలు ప్రభుత్వాలు 25,81,856 దీపం కనెక్షన్లు అందజేశాయి. మూడో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు మరింత విరివిగా గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేపట్టారు. 2014 జూన్‌లో అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ రెండున్నరేళ్లలో 14,25,938 గ్యాస్ కనెక్షన్లను పేద మహిళలకు అందజేశారు.