ఆంధ్రప్రదేశ్‌

దళితులకు అండా..దండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 5: పేదలు, బడుగు బలహీనవర్గాలకు తనతో కలిసి రావాలని, వారికి తాను అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. బాబూ జగ్జీవన్‌రామ్ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు మంగళవారం విజయవాడలో జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. అంటరాని వాడని అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌లను అవమానిస్తే, పట్టుదలతో విద్యనభ్యసించి, ఉన్నత శిఖరాలకు ఎదిగారని చెప్పారు. దళితులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి సాధించడానికి వీరు ఎనలేని కృషి చేశారని చంద్రబాబు చెప్పారు. జగ్జీవన్‌రామ్ సుదీర్ఘ రాజకీయ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన వలన పదవులకు గౌరవం పెరిగిందని అన్నారు. కాంగ్రెస్సేతర పార్టీలన్నీ ఏకమైనప్పుడు జగ్జీవన్‌రామ్‌తో ఎన్టీఆర్ సన్నిహితంగా కలిసి పనిచేశారని చంద్రబాబు చెప్పారు. జగ్జీవన్‌రామ్ మరణించిన వెంటనే బషీర్‌బాగ్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అలాగే హైదరాబాద్‌లో జగ్జీవన్‌రామ్ భవనాన్ని నిర్మించామని ఆయన తెలియచేశారు.
పేదలకు 50 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉచితంగా మరుగుదొడ్లను కట్టి ఇస్తామన్నారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆరు లక్షల ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకించి స్పోర్ట్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. అమరావతిలో జగ్జీవన్‌రామ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అలాగే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.

చిత్రం... బాబూ జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పిస్తున్న చంద్రబాబు