ఆంధ్రప్రదేశ్‌

ఇసుక ఇక నిత్యావసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 5: పర్యావరణ అనుమతులు లేకుండా రాష్ట్రంలోని ఏ రీచ్‌లోనూ ఇసుక తవ్వకాలు జరపరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పర్యావరణ అనుమతులను ఆయా జిల్లా కలెక్టర్లే జారీ చేసే విధంగా ఆదేశాల్లో పేర్కొంది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఎపిలో ఇసుకను నిత్యావసర వస్తువస్తువుల చట్ట పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ఏ విధంగా అమలు జరుగుతోందో ముఖ్యమంత్రే పర్యవేక్షించనున్నారు. అక్రమార్కులకు అధికార పార్టీలో ఎవ్వరూ సహకరించకూడదన్న ఉద్దేశంతో సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒక ఇంటి నిర్మాణం కోసం వెచ్చించే మొత్తంలో 30 శాతం మొత్తాన్ని ఇసుక కోసమే ఖర్చు చేయాల్సి వచ్చేది. ఉచిత ఇసుకతో ఆ ఇబ్బంది ఉండదని ప్రభుత్వం చెపుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక క్వారీల వేలం పద్ధతికి స్వస్తి పలికింది. ఆ తరువాత డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక విక్రయానికి శ్రీకారం చుట్టింది. ఇసుక విక్రయాల ద్వారా డ్వాక్రా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా చూడాలని ప్రభుత్వం భావించింది. అయితే, ప్రభుత్వం ఆశయాలు నెరవేర లేదు. ఈ ప్రయోగంలో కొన్ని లోటుపాట్లు ఉండడం వలన ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇసుక రవాణా, అమ్మకాల్లో జరుగుతున్న లోపాలను పరిశీలించి, వాటిని సరిచేయడానికి నడుం బిగించింది. ఇసుక మాఫియాను అరికట్టడానికి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 524 ఉచిత ఇసుక రీచ్‌లు గుర్తించారు.
ఇసుక లభ్యమవుతున్న ప్రాంతాల నుంచి ప్రజల వ్యక్తిగత అవసరాల కోసం అంటే గృహ నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, స్థానిక ప్రభుత్వ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ వాల్టా చట్టానికి లోబడి ఉచితంగా ఇసుకను తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొంది. పర్యావరణ అనుమతుల్లేని ఇసుక రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలను జరపరాదని ఆదేశించింది. ప్రభుత్వం గుర్తించి, నోటిఫై చేసిన ర్యాంపుల ద్వారా మాత్రమే ఇసుక రవాణా చేయాలని ఆదేశించింది. ప్రజలు తమ సొంత అవసరాల కోసం స్థానిక రీచ్ ఇన్‌చార్జ్‌లను సంప్రదించి లోడింగ్ చార్జీలను చెల్లించి అవసరం మేరకే ఇసుక తీసుకోవాలని సూచించింది. లోడింగ్ చార్జీలు మినహాయించి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇసుకను యంత్రాలతో తవ్వడాన్ని నిషేధించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రీచ్‌లు సాయంత్రం ఆరు గంటలకు మూసివేయాలని, రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనురి లోడింగ్ చేయడానికి వీల్లేదని సూచించింది.
ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి నిరభ్యంతరంగా ఇసుక తెచ్చుకోవచ్చు కానీ ఇక్కడి ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పట్టాదారుడు తన పట్టా భూమిలో లభించే ఇసుకను కూడా ప్రజలకు అందచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నోటిఫై చేయని ఇసుక రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అక్రమ రవాణాలో పట్టుబడితే లారీని సీజ్ చేయాలని, ఇసుకను 15 రోజుల్లోగా వేలం వేయాలని, అదే వాహనం రెండోసారి దొరికితే వాహన యజమానిని పిడి యాక్ట్ అరెస్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా క్యూబిక్ మీటరు ఇసుక తవ్వితే 2000నుంచి లక్ష రూపాయల వరకూ జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ, వాహనాలను జప్తు చేస్తారు. రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించినందువలన ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇసుకను రవాణా చేసుకోవచ్చు. చట్టపరంగా ఇసుక తీసుకువెళ్లే వారిని ఎవ్వరు అడ్డుకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18005994599కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు 68 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసింది. రెండు రోజులకు ఒకసారి ఇసుక రీచ్‌లను పరిశీలించేందుకు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది.