ఆంధ్రప్రదేశ్‌

నదుల అనుసంధానంతో పర్యావరణానికి ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 8: నదుల అనుసంధానం భవిష్యత్తులో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపనుందని స్టాక్‌హోమ్ వాటర్ బహుమతి గ్రహీత, వాటర్‌మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన రాజేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. విజయవాడలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో నీరు-అభివృద్ధి అన్న అంశంపై ఆదివారం జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నదుల అనుసంధానం పర్యావరణం పరంగా, ఆర్థికంగా, సంస్కృతిపరంగా సరికాదన్నారు. నదుల అనుసంధానం అంటే కాలుష్యాన్ని, అవినీతిని కూడా అనుసంధానం చేయడమేనన్నారు. ఒకరి శరీరంలోని రక్తనాళాలను ఇంకొకరికి కలపడం లాంటిదేనన్నారు. దీని వల్ల వ్యవస్థ పాడవుతుందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ విస్తృతంగా నీటి వనరులు ఉన్న అందమైన రాష్టమ్రన్నారు. నదులతో హృదయాన్ని, మేథస్సును జోడిస్తే, నదుల అనుసంధానం కన్నా మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. నదుల అనుసంధానం ఉత్తమ నమూనా కాదని, ఇందులో అనేక ఆర్థికపరమైన అంశాలు ముడివడి ఉన్నాయన్నారు. నీటి నిర్వహణ వికేంద్రీకరణ వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.