ఆంధ్రప్రదేశ్‌

28న నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏఫ్రిల్ 5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుండి ఈ నెల 28న పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం మంగళవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్‌ఆర్ చైర్మన్ డాక్టర్ సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్‌తో పాటు శాస్తవ్రేత్తలు పాల్గొని రాకెట్ అనుసంధాన పనులు, ప్రయోగం సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 28న ప్రయోగించేందుకు తుది నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. మార్చిలో జరగాల్సిన ఈ ప్రయోగం ఉపగ్రహం తయారీ ఆలస్యం కావడంతో వాయిదా వేశారు.
ఉపగ్రహం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రంలో శాస్తవ్రేత్తలు రూపొందించారు. దీన్ని ఈ వారం చివరిలో షార్‌కు రోడ్డు మార్గాన తీసుకురానున్నారు. ఇప్పటికే నావిగేషన్ సిరీస్‌కు సంబంధించిన ఆరు ప్రయోగాలు ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఇది చివరి ప్రయోగం కావడం విశేషం. ఇస్రో వర్గాల సమాచారం మేరకు ఈ నెల 28న మధ్యాహ్నం 12:59గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఇప్పటికే రాకెట్ మొదటి దశ అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. మిగిలిన మూడు దశల అనుసంధాన పనులు, కౌంట్‌డౌన్ తదితర అంశాల పై ఎంఆర్‌ఆర్ సమావేశంలో శాస్తవ్రేత్తలు చర్చించారు. బుధవారం నుండి రెండో దశ అనుసంధాన పనుల కార్యక్రమాన్ని శాస్తవ్రేత్తలు ప్రారంభించనున్నారు. అన్ని పూర్తయినంతరం రాకెట్ చివరి భాగంలో ఉపగ్రహాన్ని అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. ప్రయోగ చివరి ఎం ఆర్ ఆర్ సమావేశం ఈ నెల 25న జరగనుంది. అదే రోజు షార్ డైరెక్టర్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి సంబంధించిన విషయాలను అధికారింగా ప్ర