ఆంధ్రప్రదేశ్‌

రోజా కేసుకు తెర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: ఏపి అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా వివాదానికి 3తెర2 పడుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. బుధవారం (6న) అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందుకు రోజా హాజరుకానున్నారు. గతంలో ఆమె రెండు పర్యాయాలు కమిటీ ముందుకు హాజరు కాకుండా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు సింగిల్‌బెంచ్ ఆమెను అసెంబ్లీ సమావేశాలకు అనుమతించాలని ఆదేశించగా, అసెంబ్లీ ఇన్‌ఛార్జీ కార్యదర్శి కె. సత్యనారాయణ రావు ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ ముందు అప్పీలుకు వెళ్లారు. కేసును పరిశీలించిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. దీంతో రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉంది. కాగా అసెంబ్లీ రోజా అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ సిఫార్సుల మేరకు రోజాకు మరోసారి ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలులో ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానున్నది. కమిటీ ముందు హాజరయ్యేందుకు రోజా సుముఖంగా ఉన్నారని తెలిసింది. అయితే కమిటీ ముందు హాజరైన తర్వాత క్షమాపణ చెప్పినా లేక జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నాననిగానీ ఆమె అంటే ఇక వివాదమే ఉండదు. అలా ఆమె చెబితే కమిటీ స్పీకర్‌కు నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదికను స్పీకర్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టిస్తారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి మెజారిటీ అభిప్రాయం మేరకు ఆమె సస్పెన్షన్‌ను ఎత్తివేస్తారు. కానీ రోజా క్షమాపణ లేదా విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పకపోతే సస్పెన్షన్ కొనసాగుతుంది.