ఆంధ్రప్రదేశ్‌

కులాల మధ్య చిచ్చు బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 6: కులాల మధ్య చిచ్చు రగిల్చి, ప్రభుత్వాన్ని ఇబ్బందిపాలు చేయడం మంచిది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లడుతూ ఎన్నో కష్టాల మధ్య ప్రభుత్వాన్న నడుపుతున్నామన్న విషయాన్ని బాధ్యత గల అంతా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిసిలు, కాపులు అసంతృప్తి చెందకుండా కార్యాచరణ తీసుకురావాలన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొన్ని కుల సంఘాల నాయకులు తమ ఖాతాలో వేసుకుంటామంటే కుదరదని ఆయన అన్నారు. కులాల కుమ్ములాట లేని సమాజ స్థాపనే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కాపు కార్పొరేషన్‌కు 1000 కోట్ల రూపాయలు కేటాయించామని, ఆ మొత్తాన్ని ఏవిధంగా ఖర్చు చేయాలన్న అంశంపై కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేపట్టామని అన్నారు. త్వరలోనే 11 జిల్లాల్లో కూడా అభిప్రాయాలు సేకరిస్తామని ఆయన చెప్పారు. కాపులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎకనమిక్ ఎసట్ ప్రోగ్రాంకు రూపకల్పన చేస్తున్నామని అన్నారు. రాజీవ్ యువశక్తి పథకం ద్వారా 50 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తామని అన్నారు. ఉన్నత విద్య చదివే విద్యార్థులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలనుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. వృత్తి నైపుణ్యం పెంచేందుకు కార్యాచరణ కూడా రూపకల్పన చేస్తున్నామని, ఇది ఏవిధంగా ఉండాలన్న అంశంపై చర్చిస్తున్నామని ఆయన చెప్పారు.

వైకాపా డ్యామ్ కూలుతోంది
ఎంపి జెసి దివాకరరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 6: జగన్ ఇప్పటికీ తన తండ్రి పేరు చెప్పుకుని తిరుగుతున్నాడని ఎంపి జెసి దివాకరరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడలో కలిశారు. ఆ తరువాత విలేఖరులతో మాట్లాడుతూ జగన్ తన తండ్రి పేరు చెప్పుకుని ఎంతకాలం తిరుగుతారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకునిగా ఆయన విఫలమయ్యారు. ప్రతి రోజు ఆయన వైఫల్యాలు కనిపిస్తునే ఉన్నాయని ఆయన అన్నారు. రెండేళ్లలో ఆయన ఏం సాధించారని ప్రశ్నించారు. వైకాపా నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, నాయకులు టిడిపిలోకి వచ్చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకూ వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు పసుపు శాలువాలు కప్పేవారు. ఇప్పుడు పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలు ఎవరి శాలువాలు వారు తెచ్చుకుంటున్నారని చెప్పారు. వైకాపా అనే డామ్ త్వరలోనే కూలిపోతుందని ఆయన తెలియచేశారు. అనంతపురంలో రోడ్ల విస్తరణకు ముఖ్యమంత్రి 60 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే విస్తరణ జరగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే అడ్డుకుంటున్నారు. ముఖ్యమంత్రి తన ఏజెన్సీలతో దర్యాప్తు జరిపించి, వాస్తవాలను తెలుసుకుని రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని దివాకరరెడ్డి సిఎంను కోరారు

ఇంద్ర బస్సులో మంటలు

ఆంధ్రభూమి బ్యూరో
చిలకలూరిపేట - విజయవాడ ఇంద్ర ఎసి బస్ విజయవాడ పిండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లోకి చేరుతుండగా ప్రవేశద్వారంకు కూతవేటు దూరంలో జాతీయ రహదారిపై బస్ ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ ఎంఎస్ నాయక్ సమయస్పూర్తితో రోడ్డుపైనే ఇంజన్ ఆపివేశారు. అప్పటికే బస్‌దిగేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికులు ఆ మంటలు చూసి భీతావహులయ్యారు. కొందరు కిటికీ అద్దాలు పగులకొట్టి కిందకు దూకారు.
అప్పటికే అత్యధిక మంది ప్రయాణికులు కొందరు నగరంలో వారధి వద్ద, మరికొందరు కృష్ణలంక ఫైర్‌స్టేషన్‌వద్ద దిగగా ఇంకా ఏడుగురు మాత్రమే మిగిలారు. ఏదిఏమైనా డ్రైవర్‌తో సహా ప్రయాణికులందరూ సురక్షితంగా బైటపడ్డారు. ఏదిఏమైనా ఘోర ప్రమాదం తృటిలో తప్పిందనే చెప్పాలి. 7జడ్101 నెంబరు ఇంద్ర బస్ నిత్యం ఉదయం 9.30లకు చిలకలూరిపేటలో బయలుదేరి 11.30 ప్రాంతంలో విజయవాడ బస్‌స్టేషన్‌కు చేరుతుంది. మధ్యలో నాలుగు ట్రిప్‌లు విజయవాడ - గుంటూరు మధ్య నడుస్తుంది.

సెప్టెంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు?

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 6: రాష్ట్రంలో పాలకవర్గాలు లేని నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలకు సెప్టెంబర్‌లో ఎన్నికల నగరా మోగనుంది. ఓటర్ల జాబితా సవరణ అనంతరం వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ సూచనప్రాయంగా వెల్లడించారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు నగర పాలకసంస్థలు, రెండు పురపాలకసంఘాలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. మే 16 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఆ తరువాత వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. ఆ తరువాత ఎన్నికలు నిర్వహిస్తారని వివరించారు. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని సూచనప్రాయంగా తెలిపారు. శివారు గ్రామాల విలీనంపై కోర్టు పరిధిలో వివాదాలు ఉన్న విషయంపై స్పందిస్తూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసి, ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తామన్నారు. విశాఖ మెట్రోరీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (విఎండిఎ) పూర్తి స్థాయిలో ఏర్పాటుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.