తెలంగాణ

టోల్‌గేట్‌లవద్ద పడిగాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 12: సంక్రాంతి సెలవులతో హైద్రాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు ఉద్యోగులు, ప్రజలతో వాహనాల రద్దీ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా హైద్రాబాద్ -విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి ఎక్కడికక్కడ వాహనాల బారులతో కనిపిస్తోంది.
గురువారం టోల్‌ప్లాజాల వద్ద వాహనాల ట్రాఫిక్ పెరిగిపోయింది. పండుగవేళకల్లా ఇంటికి చేరాలన్న తాపత్రయం ప్రయాణికుల్లో ఉంది. అయితే వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం, టోల్‌ప్లాజాలవద్ద వాహనాలను విడిచిపెట్టడంలో జాప్యం జరగడంతో వారు విసిగిపోతున్నారు. నోట్లరద్దు ప్రభావం కూడా వాహనాల క్లియర్ చేయడానికి కారణమవుతోంది. సరైన చిల్లర లేకపోవడం, డిజిటల్ చెల్లింపులు చేస్తూండటంతో సమయం వృధా అవుతోంది. దీంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. అయితే ఈ సమస్యను అధిగమించడానికి జిఎంఆర్ సంస్థ అదనపు ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు 15నుండి 18వేల వాహనాలు విజయవాడ, అమరావతివైపు వెడుతూంటాయి. గత సంక్రాంతి సందర్భంగా ఈ రెండు రోజుల్లో అదనంగా 25వేల వాహనాలు వెళ్లాయి. అదే అంచనాతో ఇప్పుడు తగిన ఏర్పాట్లు చేశారు. విజయవాడవైపు వెళ్లే వాహనాలను విడిచిపెట్టే గేట్ల సంఖ్యను బాగా పెంచారు. పంతంగి, కొర్లపహడ్ టోల్ ఫ్లాజాల వద్ద హైద్రాబాద్ వైపునాలుగు, విజయవాడ వైపు ఎనిమిది గేట్లు ఏర్పాటు చేశారు. అదనపు స్వైప్ మిషన్లతోపాటు ముందస్తుగా తగిన చిల్లర డబ్బులను సైతం సమకూర్చుకుని వాహనాలు టోల్‌గేట్ల వద్ద ఆగకుండా చూస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, కార్లు అధికంగా వస్తుండంతో టోల్‌ఫ్లాజాల వద్ధ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ సాధారణ రోజుల్లో కంటే మూడునాలుగింతలు అధికంగా కనిపిస్తుంది. అటు నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై సైతం గుంటూరు వైపు వెళ్లే వాహనాల రద్దీ పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో ఆరుగేట్ల గుండా 5నుండి 6వేల వాహనాలు వెలుతుండగా సంక్రాంతి సందర్భంగా గురువారం ఏకంగా 10వేల వాహనాలు గుంటూరు వైపు వెళ్లాయి. హైద్రాబాద్ నుండి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాల సంఖ్య నేడు శుక్రవారం మరింత పెరుగనుందని అంఛనా వేస్తున్నారు. మరోవైపు హైద్రాబాద్-వరంగల్ జాతీ య రహదారిపై బీబీనగర్ టోల్‌ఫ్లాజా వద్ధ సైతం వాహనాల రద్దీ పెరిగిన ఆంధ్ర వైపు వెళ్లే వాహనాల రద్దీతో పోల్చితే తక్కువగా ఉంది.

చిత్రం..హైద్రాబాద్ -విజయవాడ 65నెంబర్ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహడ్ టోల్
ప్లాజాల వద్ద ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు వెళుతున్న ప్రయాణికుల వాహనాల రద్దీ దృశ్యం