ఆంధ్రప్రదేశ్‌

పండుగపూట తీరని విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట/మాచర్ల, జనవరి 15: సంక్రాంతి పండుగవేళ ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. సెలవుల సందర్భంగా ఆటలాడుకుంటూ ఆనంద డోలికల్లో తేలియాడుతున్న చిన్నారులు మృత్యుకుహరంలోకి జారుకుని విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరుల కంటతడి పెట్టిస్తోంది. గుంటూరు జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. సెలవులకు అంతా ఒకచోటచేరి ఆనందంగా గడిపిన క్షణాల్లోనే ముగ్గురు యువకులు అనంతలోకాలకు చేరిన ఘటన అచ్చంపేట మండలం కోనూరులో జరిగింది. అజయ్ (19), కౌటిల్య (11), మానవేంద్ర (15) మరో నలుగురు స్నేహితులు రూపాంజలి, నాని, రుద్రదేవ్, లక్ష్మీప్రావీణ్యతో కలిసి నదిలో ఈతకు వెళ్లారు. తొలుత కౌటిల్య నదిలో దిగాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి జారుకుని నీట మునిగాడు. అతన్ని రక్షించేందుకు చేయి అందించిన అజయ్ కూడా కొట్టుకుపోతుండగా మనవేంద్రరాయ్ వారిద్దరినీ రక్షించే ప్రయత్నంలో గల్లంతయ్యాడు. ఒడ్డున ఉన్న సన్నిహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లు రంగంలో దిగి నాలుగు గంటల అనంతరం మృతదేహాలను వెలికితీశారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అజయ్ గుంటూరులో బిటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కాగా, మనవేంద్రరాయ్ 9వ తరగతి, కౌటిల్య 6వ తరగతి విద్యార్థులు.
మాచర్ల మండలం లింగాపురంలో చంద్రవంక నదిలో మునిగి మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దండా శివరామకృష్ణ (6), శ్రీసాయి (5) నదిలో దిగి మునిగిపోయారు. ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు అంజయ్య, రమణ కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలకు పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.