ఆంధ్రప్రదేశ్‌

హజ్ యాత్ర దరఖాస్తులకు 24 వరకు గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 15: మన దేశం నుంచి హజ్ యాత్రకు గత ఏడాది లక్షా 36 వేలుగా వున్న కోటా ఈ ఏడాది లక్షా 70 వేలకు పెరిగింది. అంటే అదనంగా మరో 34వేల మంది హజ్ యాత్ర చేయడానికి అవకాశం లభించింది. గత 30 ఏళ్లలో ఇంత భారీస్థాయిలో కోటా పెరగడం ఓ రికార్డు. ఈ ఏడాది హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోడానికి ఈ నెల 24 చివరి తేదీ. ఇప్పటి వరకు 13 జిల్లాల నుంచి 1360 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. సమయం తక్కువగా ఉండటంతో హజ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు వెంటనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎపి స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి లియాఖత్ అలీ ఒక ప్రకటనలో సూచించారు. జిల్లా హజ్ సొసైటీలతో పాటు 60 ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్ల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోడానికి ఎపి స్టేట్ హజ్ కమిటీ ఏర్పాట్లు చేసింది. మన దేశానికి చెందిన ముస్లిం ఎవరైనా హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రాలో ఎంపికైన వారికి రెండు కేటగిరీల్లో వసతి సదుపాయాలు ఉంటాయి.
గ్రీస్‌లో రూ. 2.19 లక్షలు, అజీజియాలో రూ. 1.81 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. హజ్ దరఖాస్తులతో పాటు అవసరమైన డాక్యుమెంట్లు, రెండు కలర్ ఫొటోలు, పాస్‌పోర్టు కాపీ, చిరునామా కాపీ, క్యాన్సిల్డ్ బ్యాంక్ చెక్, రూ.300 సంబంధించిన చలానా (ఎస్‌బిఐ లేదా యూనియన్ బ్యాంక్) ఇవ్వాల్సి ఉంటుంది. జిరాక్స్‌లు స్పష్టంగా ఉండాలి. దరఖాస్తు చేసుకున్నవారు ప్రింట్ అవుట్ కాపీని జిల్లా హజ్ సొసైటీలు, లేదా విజయవాడలోని స్టేట్ హజ్ కమిటీ కార్యాలయంలో నేరుగా అందించవచ్చు. లబ్బీపేట మసీదు వీధిలో 3వ అంతస్తులో స్టేట్ హజ్ కమిటీ హజ్ దరఖాస్తు చేసుకునే వారికి సేవలందిస్తోంది. టోల్ ఫ్రీ నెంబర్ 1800 4257873కు ఫోన్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చని లియాఖత్ అలీ వివరించారు.