ఆంధ్రప్రదేశ్‌

ఫిరాయంపుల చట్టం బేఖాతర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 16: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో అమల్లోకి వచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టం నవ్వులపాలవుతున్నట్లు స్పష్టవౌతోంది. ప్రస్తుతం ఏ క్షణాన ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే అధికార పక్షంలోకి 3జంప్2 చేస్తారో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. పార్టీ ఫిరాయింపుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొందరు త్వరలోనే తమ బాటలో పయనించబోతున్నారంటూ ఇప్పటికే తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వంటి సీనియర్లు పదేపదే చెబుతున్నారు. 175 శాసనసభ స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కూటమి, వైకాపా మినహా మరో పార్టీకి గత ఎన్నికల్లో అవకాశం లేకుండాపోయింది. వైకాపా తరపున 64 మంది గెలుపొందితే ఇప్పటికి 21 మంది ఒకరి వెంట మరొకరుగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 119 స్థానాలు కలిగిన తెలంగాణలో టిడిపి తరపున 15 మంది గెలుపొందితే 12 మంది టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి ఏడుగురు, బహుజన సమాజ్ పార్టీ నుంచి ఇద్దరు, సిపిఐ నుంచి ఒకరు, వైకాపా నుంచి ముగ్గురు మొత్తం 25 మంది టిఆర్‌ఎస్‌లోకి వలసపోయారు. ఆశ్చర్యకర విషయమేమంటే 3పార్టీ ఫిరాయింపుల చట్టం2 ఈ రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్కరిపై కూడా వర్తించకపోవడం! ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. చట్టాన్ని పక్కనపెడితే ఇక్కడ నైతిక విలువలకు కూడా స్థానం లేకుండా పోతోంది.
స్వాతంత్య్రానంతరం నుంచి కూడా దేశంలో అభ్యర్థుల వ్యక్తిత్వం, గుణగణాలను బట్టి కాకుండా కేవలం పార్టీ గుర్తుల ఆధారంగానే అనామకులు సైతం చట్టసభల్లోకి ప్రవేశించ గలుగుతున్నారు. అలాంటిది ప్రజాతీర్పును ఏఒక్కరూ గౌరవించక పోవటాన్ని చూస్తే రాజకీయాలంటేనే ముఖ్యంగా యువతరంలో ఏవగింపు కలుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే 1978-82 నాటి పరిస్థితి నేడు పునరావృతవౌతోంది. నాడు ఫిరాయింపుల చట్టం లేనప్పటికీ ప్రజాప్రతినిధులు నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన సంఘటనలున్నాయి. నాడు 294 శాసనసభ్యులు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనతా పార్టీ తరపున 60 మంది గెలుపొందారు. ఉత్తరాంధ్ర నుంచి గౌతు లచ్చన్న, పి అశోక్‌గజపతిరాజు, ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి వంటి ప్రముఖులంతా మొత్తం 16 మంది, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ముద్రగడతో పాటు ఆరుగురు, కృష్ణాలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, బూరగడ్డ నిరంజనరావు, మొక్కపాటి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లాలో దొడ్డపనేని ఇందిర, గణపా రామస్వామిరెడ్డి, జివి రత్తయ్య, ఈపూరి సుబ్బారావు, ప్రకాశంలో జాగర్లమూడి చంద్రవౌళి, పిడతల రంగారెడ్డి, నెల్లూరులో వెంకయ్యనాయుడు, రాయలసీమలో కెఇ కృష్ణమూర్తి, ఇ అయ్యపురెడ్డి వంటి ప్రముఖులతో సహా మొత్తం 12 మంది జనతా పార్టీ తరపున గెలుపొందారు. తొలుత జనతాలో చీలిక ఏర్పడి లోక్‌దళ్ ఆవిర్భవించగా వడ్డే శోభనాద్రీశ్వరరావు, అశోక్‌గజపతిరాజు, గౌతు లచ్చన్న, భమిడి నారాయణ, ఈపూరి సుబ్బారావు, మొక్కపాటి వెంకటేశ్వరరావు వంటివారు ఆ పార్టీలో చేరారు. 1980లో బిజెపి ఆవిర్భవించినపుడు ఎన్‌విఎస్ రెడ్డి, వెంకయ్యనాయుడు వంటివారు ఆ పార్టీలో చేరారు. ముద్రగడ, కెఇ, పిడతల రంగారెడ్డి వంటివారు కాంగ్రెస్‌లో చేరారు. ఇక రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచిన దివంగత వైఎస్, కాసు కృష్ణారెడ్డి వంటివారు ఇందిరా కాంగ్రెస్‌లో చేరారు. ఇక రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది 2009-2014 మధ్యకాలం. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైనందున రాజీనామాల ప్రస్థావన లేదు. అయితే ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల నుంచి 16 మంది వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరగా ఆ పార్టీ నేత దమ్ము, ధైర్యంతో వారందరితో రాజీనామా చేయించడంతో 2012 ఫిబ్రవరి 16న ఉప ఎన్నికలు జరిగాయి. 14 స్థానాల్లోను వైకాపా అభ్యర్థులు గెలుపొందగా రామచంద్రపురంలో పిల్లి సుభాష్‌చంద్రబోస్, నరసాపురంలో ఎం ప్రసాదరాజు మాత్రం ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల తర్వాత రాజీనామా అనే మాటే వినపడకుండా పోయింది. ఇదిలావుంటే 1994లో తెలుగుదేశం తరపున గెలిచిన వారిలో అనేకమంది మధ్యలో ఎన్టీఆర్ తెలుగుదేశంలోకి వెళ్లారు. మళ్లీ ఆ పార్టీ విలీనం కాకపోయినా అనేకమంది తిరిగి తెలుగుదేశంలో చేరారు. ఆ ఐదేళ్ల కాలంలోనూ పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగినప్పటికీ రాజీనామాల మాటే వినిపించలేదు.