ఆంధ్రప్రదేశ్‌

జగన్ పర్యటనపై ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 19: రైతు భరోసా యాత్ర పేరుతో రాజధాని గ్రామాల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగింది. ముందుగా సచివాలయం మీదుగా కాన్వాయ్, ర్యాలీలను అనుమతించేదిలేదని పోలీసులు తేల్చిచెప్పారు. షెడ్యూల్ ప్రకారం జగన్ తాడేపల్లి, నిడమర్రు, కురగల్లు, వెలగపూడి, ఉద్ధండరాయనిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో రైతులతో ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది. ముందుగా తాడేపల్లిలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులను పరామర్శించిన జగన్‌ను హైవే మీదుగా ఎన్నారై కళాశాల, మంగళగిరి పట్టణంలో నుంచి నిడమర్రుకు వెళ్లాలని సూచించారు. నిడమర్రులో బహిరంగసభ ముగించుకుని వెలగపూడి సచివాలయ సందర్శనకు జగన్ బయల్దేరారు. అదే సమయంలో టిడిపి మద్దతుదార్లు మరికొందరు రైతులు కాన్వాయ్‌ను అడ్డుకుని నిరనస వ్యక్తం చేశారు. ప్లకార్డులు, బ్యానర్లతో జగన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. భూ బకాసురునికి రైతుల కష్టాలేం తెలుసు..రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవటం తగదంటూ పలు నినాదాలతో కూడిన బ్యానర్లతో నిరసన తెలిపారు. దీంతో వైసిపి, టిడిపి మద్దతుదార్ల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు సర్దిచెప్పడంతో పాటు అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి జగన్ వాహనంతో పాటు మరో మూడు వాహనాలను మాత్రమే అనుమతించారు. చివరకు మీడియా వాహనాలను సైతం వేరే మార్గంలో రావాలని సూచించారు. వెలగపూడి సచివాలయంతో పాటు శాసనసభ నిర్మాణాలను జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పినె్నల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు సచివాలయంలో ప్రతిపక్ష నేత పేషీ ఓ టాయిలెట్ మాదిరిగా ఉందంటూ ఆక్షేపించారు. బలమైన ప్రతిపక్షానికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. అనంతరం వెలగపూడి నుంచి మందడం మీదుగా జగన్ లింగాయపాలెంలో రైతులతో ముఖాముఖి నిర్వహించేందుకు బయల్దేరారు.
ప్రజాస్వామ్యం ఖూనీ: జగన్
రాజధాని ప్రాంతంలో ఓ ప్రతిపక్ష నేతగా తన పర్యటనపై ఆంక్షలు విధించి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేశారని జగన్ మండిపడ్డారు.
రైతుల కష్టాలను స్వయంగా చంద్రబాబు తెలుసుకుంటే జ్ఞానోదయం కలుగుతుందనే ఉద్దేశ్యంతో వారితో ముఖాముఖి నిర్వహిస్తుంటే అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో రైతుల్ని మోసగించే ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు.

చిత్రం.. కురుగల్లు గ్రామం వద్ద జగన్ కాన్వాయ్‌ను అడ్డుకుని గో బ్యాక్ నినాదాలు చేస్తున్న టిడిపి మద్దతుదార్లు