ఆంధ్రప్రదేశ్‌

పంచాంగకర్తల ఏకీకరణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 20: సిద్ధాంతపరంగా పంచాంగకర్తల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల హిందూ పండుగల విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంటోందని ప్రముఖ జ్యోతిష పండితులు దివంగత మధుర కృష్ణమూర్తిశాస్ర్తీ కుమారుడు, విశ్వవిజ్ఞాన ప్రతిష్టానం కార్యదర్శి పాలశంకరమూర్తి శర్మ పేర్కొన్నారు. తాజాగా ఉగాది విషయంలో కూడా పంచాంగకర్తల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల వేరువేరు తేదీల్లో పండుగను జరుపుకోవాల్సి వస్తోందన్నారు. ఈనేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పంచాంగకర్తలను ఏకం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం తన నివాసంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాంగకర్తల ఏకీకరణలో భాగంగా ఈనెల 22న రాజమహేంద్రవరంలోని ఉమారామలింగేశ్వరస్వామి కళ్యాణమండపంలో విశ్వవిజ్ఞాన ప్రతిష్టానం, జ్యోతిష విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈసదస్సులో బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం రిటైర్డ్ వైస్-్ఛన్సలర్ బ్రహ్మశ్రీ శ్రీపాద సత్యనారాయణమూర్తి, రాజమహేంద్రవరం ఎవైఎస్ సంస్కృత మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్‌టికె శ్రీరంగాచార్యులు, గొడవర్తి సంపత్‌కమార్ ఆచార్య, తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగకర్త తంగిరాల వెంకట కృష్ణపూర్ణప్రసాద్, శ్రీశైలం దేవస్థానం పంచాంగకర్త బుట్టే దైవజ్ఞ, కంచిపీఠ పంచాంగకర్త లక్కావఝ్జల సబ్రహ్మణ్యసిద్ధాంతి, పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్యశర్మ తదితరులు పాల్గొని, పంచాంగ రచనలో సమన్వయ సాధనకు కృషిచేస్తారని వివరించారు. మారుతున్న కాలానుగుణంగా పంచాంగ రచనలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ హయాం నుంచి పంచాంగకర్తల సమన్వయ సాధన కృషి జరుగుతోందన్నారు. అయితే ఇందుకోసం అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సరైన నిపుణులు లేరన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్చి 28న ఉగాది పండుగను ప్రకటించారని, అయితే మధుర కృష్ణమూర్తిశాస్ర్తీ పంచాంగం, టిటిడి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానాల పంచాంగకర్తల సిద్ధాంతం ప్రకారం మార్చి 29న ఉగాది పండుగ వస్తుందన్నారు. ఇలాంటి విభేదాలను పరిష్కరించుకునేందుకే సమన్వయ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు పాలశంకరమూర్తి శర్మ చెప్పారు. ఈసమావేశంలో ఆగమ పండితులు ఎంఆర్‌వి శర్మ, అప్పల శ్రీనివాసశర్మ పాల్గొన్నారు.