ఆంధ్రప్రదేశ్‌

అహింసతోనే ప్రత్యేక గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 20: స్వాతంత్రోద్యమ కాలంలో తానునమ్మిన అహింసావాదంతోనే మహాత్మగాంధీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని గాంధీజీ మనవడు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత రాజ్‌మోహన్ గాంధీ అన్నారు. శుక్రవారం తన సతీమణి ఉషామోహన్‌గాంధీతో కలసి తిరుపతిలోని భారతీయ విద్యాభవన్స్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన్ను దుశ్శాలువతో కప్పి సన్మానించి, జ్ఞాపికతో సత్కరించారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ కేవలం అహింసావాదాన్ని మాత్రమే నమ్ముకున్నారని అన్నారు. ఇదే ఆయనకు ఇతర స్వాతంత్రోద్యమకారులకన్నా ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు అడిగిన పలుప్రశ్నలకు సమాధానమిచ్చారు.