ఆంధ్రప్రదేశ్‌

సింహాచలేశునికి సౌర వెలుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జనవరి 20: శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. 5 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో సుమారు అయిదు ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. నెడ్‌క్యాప్ పర్యవేక్షణలో హైదారాబాద్‌కి చెందిన ఒక సంస్థ ఈ పనులు చేపడుతోంది. ఒక మెగావాట్ సామర్థ్యం గల ఈ సౌర విద్యుత్ ప్లాంటు పనులు పూర్తయితే భారతదేశంలోనే తొలి హరిత దేవాలయంగా సింహాచల క్షేత్రం చరిత్రకెక్కనుంది. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మూడువేల నాలుగు వందల సౌరఫలకాలను ఏర్పాటు చేసారు. 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునే విధంగా ఫలకాలను అమర్చారు. ఎడాదికి 15 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఈవో రామచంద్రమోహన్ తెలియజేసారు. దేవస్థానానికి 75 శాతం అవసరం ఉంటుందని, మిగిలిన విద్యుత్‌ని ఎపి ఇపిడిసిఎల్‌కు ఇవ్వడానికి నిబంధనల మేరకు ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో ఆరిలోవలోని సబ్‌స్టేషన్‌కి అనుసంధానం చేస్తున్నారన్నారు. దేవస్థానానికి ఏటా కోటి రూపాయల పైగా ఆదా కానుందని ఆయన వివరించారు. భవిష్యత్‌లో దేవస్థానం ఈ విద్యుత్ ప్రాజెక్టు ద్వారా ఆర్థికంగా లాభాలు ఆర్జిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. దేశంలోనే తొలి హరిత దేవాలయంగా సింహాచల క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్న దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త, కేంద్రమంత్రి పూసపాటి అశోకగజపతిరాజు లక్ష్యం నెరవేరనుంది. దేవాలయ ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన హరిత దేవాలయ అభివృధ్ధిపై ప్రకటన చేసారు. ధర్మకర్త ప్రకటనకు అనుగుణంగా దేవస్థానం అధికారులు పనులు వేగవంతం చేసారు. ఏడాది తిరగక ముందే ప్రాజెక్టును అందుబాటులోకి తీసురానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న ట్రైల్న్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.