ఆంధ్రప్రదేశ్‌

‘తాడిపూడి’లో ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం/గంట్యాడ, జనవరి 21: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం ప్రధాన గేట్లలో ఒకటి అకస్మాత్తుగా తెరుచుకోవడంతో ఓ మహిళ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమెకోసం గాలిస్తూ ఓ కానిస్టేబుల్ నీటిలో మునిగి మరణించారు. శనివారం జరిగిన ఈ సంఘటన అధికారులను, స్థానికులను దిగ్భ్రాంత్రికి గురిచేసింది.
తాటిపూడిలో 1964లో గోస్తనీ నదిమీద రిజర్వాయర్ నిర్మించారు. ఇక్కడ నిల్వ చేసిన నీటిని విశాఖవాసుల మంచినీటి అవసరాలకు, తాటిపూడిలో వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. కాగా రిజర్వాయర్ గేట్లలో నాలుగో గేట్‌కు ఉన్న బ్యాలెన్స్ రోప్ శనివారం ఉదయం 10 గంటల సమయంలో తెగిపోవడంతో గేటు అకస్మాత్తుగా తెరుచుకుంది. దీంతో క్షణాల్లో జలాశయం నుంచి నీరు ఉద్ధృతంగా దిగువకు ప్రవహించడం మొదలైంది. ఆ సమయంలో జలాశయం దిగువన కాలువలో దుస్తులు ఉతుకుతున్న ఎస్.కోట మండలం దొరలపాలేనికి చెందిన జమ్మిలి తాడెం (34) అనే మహిళ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. నదీపరివాహక ప్రాంతాలైన గంట్యాడ, జామి, ఎస్ కోట మండలాల్లోని 12 గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను కలెక్టర్, సాగు నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు.
తాటిపూడి దిగువన కాలువలో కొట్టుకుపోయిన మహిళ కోసం అగ్నిమాపక సిబ్బంది జామి మండలంలోని పాత రైల్వే బ్రిడ్జి వంతెన వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు సిబ్బంది నదిలో వెతుకుతుండగా ఒక్కసారిగా ప్రవాహ ఉద్ధృతి పెరగడంతో కానిస్టేబుల్ బోని సింహాచలం నదిలో కొట్టుకుపోయారు. ఎస్‌ఐ దిలీప్ అక్కడ చెట్టుకొమ్మలు పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. కానిస్టేబుల్ సింహాచలం మృతదేహం సుమారు 2 కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది.
తాటిపూడి రిజర్వాయరు పూర్తిస్థాయి నీటిమట్టం 297 అడుగులు కాగా, 294 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. గేటు తెరచుకోవడంతో దాదాపు ఒక టిఎంసి నీరు బయటకుపోయిందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జలాశయం నుంచి నీరు ప్రవహిస్తూనే ఉంది. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు గేటుకు మరమ్మతులు చేపట్టి గేటును కిందకు దించారు. మరోవైపు రాత్రి 8 గంటల వరకు గాలించినా గల్లంతైన మహిళ మృతదేహం దొరకలేదు. కలెక్టర్ వివేక్‌యాదవ్‌తోపాటు ఎమ్మెల్యే కెఎ నాయుడు, కోళ్ల లలితకుమారి బాధిత కుటుంబీకులను పరామర్శించారు.
సంఘటనపై దర్యాప్తు
ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. మానవ తప్పిదమా? సాంకేతిక లోపమా? అన్న విషయమై ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ సాగునీటిపారుదల శాఖకు చెందిన సిబ్బంది లేకపోవడం గమనార్హం. మరోవైపు జివిఎంసి నుంచి గేట్ల మరమ్మతులకు సకాలంలో నిధులు మంజూరు చేయలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

చిత్రం... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తాటిపూడి జలాశయం నీరు సంఘటన వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ వివేక్ యాదవ్, నీటి పారుదల శాఖ అధికారులు