ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో పది సారా రహిత జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 24 : రాష్ట్రంలో ఇంత వరకూ పది జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటించామని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనరు ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. మరో మూడు నెలల్లో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలను కూడా సారా రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా నాటుసారా లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. దీనివల్ల నాటుసారా మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. రాష్ట్రంలో గతంలో ఏటా 50 వేల నాటుసారా కేసులు నమోదయతే ఇప్పడు ఆరు నుండి ఏడు వేల కేసులు మాత్రమే నమోదవుతున్నాయన్నారు. నాటుసారాయి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సుమారు 4 వేల మద్యం షాపులుండగా 1000 షాపుల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటుచేశామని, మిగిలిన అన్ని షాపుల్లోనూ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్సైజ్ సిబ్బంది వారి విధులతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని వారు చేస్తున్న సేవలకు తన వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామని ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు.