ఆంధ్రప్రదేశ్‌

హోదా గోదాలో ‘అనంత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 24: ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు నినాదంతో అనంతపురం జిల్లాలో మళ్లీ ఆందోళనలు చేపట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువత, విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో సంప్రదాయ జల్లికట్టు నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమించి సఫలీకృతం కావడంతో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదాపై ఉద్యమం నిర్వహణకు కార్యచరణ రూపొందిస్తున్నారు. ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు తీవ్రతరం చేయడానికి సన్నద్ధమయ్యాయి. జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చేపడుతున్న ఉద్యమం అనంతలోనూ సెగలు పుట్టిస్తోంది. సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు నినాదంతో కాగడాల ప్రదర్శన నిర్వహించనున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో దండోరా వేయించి సమావేశాలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసన తెలపాలని ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా అధ్యక్షుడు దేవరగుడి జగదీష్ మంగళవారం పిలుపునిచ్చారు.