ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగుల మెడికల్ బిల్లులు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్‌కు చేరిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: స్వాతంత్య్రానంతరం నుంచి డిఎంఇ కార్యాలయం పరిధిలోనున్న ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే విశ్రాంతి ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లుల పరిశీలన, చెల్లింపు పూర్తిగా ఆ కార్యాలయం నుంచి తొలగించబడి కొత్తగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ పరిధిలోకి చేరింది. ఈమేర ఈనెల 11వ తేదీ జారీ అయిన జీవో ఆధారంగా డిఎంఇ కార్యాలయంలోని తగులబడిన 3వేల బిల్లులు, పరిశీలనలోనున్న రెండువేలకు పైగా బిల్లులతో సహా ఇతర ఐదువేల బిల్లులు ఇప్పటికే ట్రస్ట్‌కు చేరాయి. తాజాగా ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నుంచి గురువారం ఒక ప్రకటన కూడా జారీ అయింది. ఇక నుంచి ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు తమ మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లులను హైదరాబాద్‌లోని లేదా గుంటూరులోని ట్రస్ట్ కార్యాలయాలకు పంపించాల్సిందిగా కోరారు. ఇక నుంచి దరఖాస్తుదారులు తమ దరఖాస్తులపై తమ మొబైల్ నెంబర్‌ను పొందుపరిస్తే వారి దరఖాస్తు సమాచారం తక్షణం ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేసేలా సరికొత్తగా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వచ్చిన బిల్లులకు వరుస క్రమంలోనే ప్రాధాన్యతనిస్తామని చెబుతున్నారు. ఇక ట్రస్ట్‌కు ఐదువేల మెడికల్ బిల్లులు చేరటంతో సాధ్యమైనంత మేర త్వరగా వాటిని పరిశీలించి ఆయా ప్రభుత్వ శాఖలకు తిరిగి పంపించే క్రమంలో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ బిల్లులకు సంబంధించిన దరఖాస్తులన్నింటిని మార్చి మాసాంతంలోగా పరిశీలించి వెనక్కి పంపించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు డిఎంఇ కార్యాలయంలో నెలల తరబడి ఈ బిల్లులు పెండింగ్‌లో వుండేవి. పైగా దరఖాస్తుదారులు కాళ్లరిగేలా తిరగడమే గాక భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సి వచ్చిందంటున్నారు. తాజాగా ట్రస్ట్ అధికారులు సరికొత్త సంస్కరణలు చేపట్టారు. ఏ ఒక్కరూ తమ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదంటూ సమాచారం కోసం సంప్రదించేందుకు ముఖ్యుల ఫోన్ నెంబర్లను కూడా ప్రకటించారు. ట్రస్ట్ డెప్యూటీ ఇవో 8333817338, ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ 8333817355, ఇహెచ్‌ఎస్ ఫిర్యాదుల విభాగంకు 8333817469 నెంబర్లకు నేరుగా ఫోన్ చేయవచ్చు. ఇదిలావుంటే ఉద్యోగుల జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి సంబంధించి ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలు తమకు ఏ మాత్రం లాభసాటిగా లేవంటూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం అమలు నిలిచిపోయింది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి ఆసుపత్రుల యజమానుల సంఘ ప్రతినిధులతో చర్చలనంతరం ప్రస్తుతం అమల్లోనున్న వైద్యసేవల ధరలపై 21.11 శాతం పెంచుతూ ఈ నెల 23 తేదీ 12 నెం. జీవో జారీ అయింది. ఈ పెరిగిన ధరలకు ఈ నెల 31 తేదీలోగా అనుమతించిన ఆసుపత్రులను మాత్రమే ఈ పథకం కింద కొనసాగిస్తామని ఇతర ఆసుపత్రులను తొలగిస్తామంటూ ట్రస్ట్ సిఇవో ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.