ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్భ్రావృద్ధికి సమష్టి కృషిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: దేశ సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని చాటేలా దేశభక్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకులు కె జయరావ్ ఉద్యోగులకు ఉద్బోధించారు. 68వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని సమాచార, పౌర సంబంధాల శాఖ, రాష్ట్ర సమాచార కేంద్రంలో సహాయ సంచాలకులు జయరావ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం లభించిందని గుర్తుచేశారు. డా. బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని వ్యవసాయ, పారిశ్రామిక, సామాజిక, శాస్త్ర సాంకేతిక, క్రీడా, తదితర రంగాల్లో మరింత గణనీయమైన ప్రగతిని సాధించేలా ఉద్యోగుల సమష్టిగా కృషి చేసి దేశానికి మరింత వనె్న తెద్దామన్నారు. పతాకావిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ డిపిఆర్‌వో ఎస్‌వి మోహనరావు, ఎపిఆర్వోలు ఎం లక్ష్మణాచార్యులు, జి రాంబాబు, విలాయత్ అలీ, షానమాజ్ ఖాన్, ప్రచార సహాయకులు వివి ప్రసాద్, సిహెచ్ జాక్సన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
సిబ్బందికి బాబు మిఠాయిలు!
68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉండవల్లిలోని తన నివాసం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్భ్రావృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఈసందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం వ్యక్తిగత, రక్షణ సిబ్బందికి ఆయన మిఠాయిలు పంచారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవి రాజవౌళి, కార్యదర్శులు శ్రీనివాస్, రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న జాతీయ జెండాను ఆవిష్కరించారు.