ఆంధ్రప్రదేశ్‌

రోడ్డెక్కకుండా ‘సోషల్’ సపోర్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 26: ప్రజా సమస్యలపై తెల్లవారక ముందే కోడై కూసే నెటిజన్లు తీరా వాటిపై జరిగే ఉద్యమాలకు మాత్రం దూరంగానే ఉంటారన్న విషయం మరోసారి నిజమైంది. సమర్ధుడైన పట్ట్భద్రులను, నిస్వార్ధపరులైన ఎమ్మెల్యేలనే ఎన్నుకోవాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చే విద్యావంతులు, అసలు ఎన్నికల్లో ఓట్లే వేయడం లేదన్న వాస్తవం వరసగా రుజవవుతూనే ఉంది. పట్ట్భద్రుల ఎన్నికల్లో ఓటింగ్ శాతం అత్యల్పం కావడమే దానికి నిదర్శనం. తాజాగా రాష్ట్రంలో చర్చనీయాంశమైన ప్రత్యేక హోదా ఉద్యమంలో కూడా విద్యావంతులైన నెటిజర్లు కార్యాచరణకు దూరంగా ఉండి, కామెంట్లు, ట్వీట్లు, ఇమేజ్‌లు షేర్ చేయడం ద్వారా నైతిక మద్దతు ప్రకటించారు. ఫలితంగా గురువారం జరిగిన ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమాలన్నీ ఆయా పార్టీల కార్యకర్తలకే పరిమితమయ్యాయి. వీటిలో ఎక్కడా విద్యావంతులు పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు. చివరకు ఆంధ్ర, నాగార్జున, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలకు చెందిన వామపక్షపార్టీల అనుబంధ సంఘాల కార్యకర్తలు తప్ప, మిగిలిన విద్యార్ధులెవరూ హోదా ఉద్యమంలో భాగస్వాములు కాకపోవడం ప్రస్తావనార్హం. మరో రెండు నెలల్లో పరీక్షలు, దానితోపాటు పోటీ పరీక్షలకు హాజరయ్యే మూడ్‌లో ఉన్న వారంతా పుస్తకాలకే పరిమితమయ్యారు. సామాజిక అంశాలపై నిరంతరం స్పందించే ఆసక్తి ఉన్న విద్యావంతులు మాత్రం, స్థానికంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములు కాకుండా.. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో తమ ప్రొఫైల్ పిక్చర్‌లో ఉన్న తమ ఫొటోలకు బదులు, ప్రత్యేక హోదా కోసం పోరాడండి అన్న నినాదం ఉన్న ఇమేజ్‌ను ఉంచడం ద్వారా, ఉద్యమానికి నైతిక మద్దతు ప్రకటించారు. కాగా, గత మూడు నెలల క్రితం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఏపిలో దాదాపు కోటి 30లక్షల మందికి ట్విట్టర్, ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నట్లు తేలింది. అందులో హోదాపై స్పందిస్తూ ఆ ఉద్యమానికి తమ మద్దతుగా, దాదాపు 70 శాతం మంది తమ ప్రొఫైల్ పిక్చర్స్‌లో హోదా లోగో పెట్టారు. దీన్నిబట్టి విద్యావంతులు సామాజిక అంశాలపై కేవలం చర్చలు, పనిలేని వాదనలకే తప్ప, ఉద్యమాలకు దూరంగానే ఉంటారన్న వాస్తవం స్పష్టమవుతోంది.