ఆంధ్రప్రదేశ్‌

గాంధేయ మార్గంలోనే రిజర్వేషన్ల సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, జనవరి 26: ప్రభుత్వంపై పలు రూపాల్లో వత్తిడితెచ్చి, శాంతియుతంగా, గాంధేయమార్గంలోనే ఆందోళనలు చేసి రిజర్వేషన్లు సాధించుకోవాలని కాపు రిజర్వేషన్ల జెఎసి సమావేశం తీర్మానించింది. ప్రత్తిపాడులోని కాపు ఉద్యమనేత ముద్రగడ నివాసంలో గురువారం సమావేశమైన కాపు జెఎసి నేతలు ఈ మేరకు తీర్మానించారు. కాపులను బిసిల్లో చేరుస్తానని పాదయాత్రలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం కాపు సత్యాగ్రహ యాత్రను ప్రభుత్వం రెండు పర్యాయాలు అక్రమంగా నిలిపివేయడం ఎంత వరకూ సమంజసమని జెఎసి నేతలు ప్రశ్నించారు. కాపుల ఉద్యమాన్ని చంద్రబాబు ఒక పథకం ప్రకారం పోలీసులచేత అణగదొక్కిస్తున్నారని సమావేశం అభిప్రాయపడింది. కాపులు ఏ కార్యక్రమం చేపట్టినా 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయని చెబుతూ అడ్డుకుంటున్నారని జెఎసి ఆందోళన వ్యక్తం చేసింది. 2 గంటల పాటు నిర్వహించిన సమావేశం అనంతరం జెఎసి నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, కలవకొలను తాతాజీ విలేకర్లతో మాట్లాడారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, హైకోర్టు తీర్పు ఇచ్చినా అడ్డుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఆసలు న్యాయ స్థానాలను గౌరవిస్తోందా అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 12న విశాఖపట్టణంలో 13 జిల్లాలకు చెందిన కాపు జెఎసి నాయకులు ముద్రగడ సమక్షంలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నెల 31వ తేదీ నాటికి తునిలో కాపు ఐక్య గర్జన పేరిట సమావేశం జరిపి సంవత్సరం అయిన సందర్భంగా ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని అమలు చేయాలని గుర్తుచేస్తూ 13 జిల్లాల్లోని మండలాలు, గ్రామస్థాయిల్లో ప్రార్థనా మందిరాలు, దేవాలయాల్లో జాతి యావత్తు చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగేలా ప్రార్థనలు చేయాలని సమావేశం తీర్మానించినట్టు ఆకుల తెలిపారు. 30న భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించే అంశాలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటన చేస్తారన్నారు. జెఎసి నాయకులు వైవి దాసు, కలవకొలను తాతాజీ, పశ్చిమ గోదావరి నుండి ఆరేటి ప్రకాష్, విశాఖ నుండి తోట రాజీవ్, అనంతపురం నుండి వి వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం నుండి అద్దేపల్లి శ్రీ్ధర్, ఆకుల ఉమామహేశ్వరి, వీసాల సుబ్బన్న, సంగిశెట్టి అశోక్, పివి రమణ, నల్లా విష్ణు, నల్లా పవన్, మిండుగంటి మోహన్, గౌతు స్వామి తదితరులు పాలొ గన్నారు.