ఆంధ్రప్రదేశ్‌

బీచ్ రోడ్డులో అప్రకటిత కర్ఫ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 26: జల్లికట్టు కోసం తమిళ ఉద్యమం జరిగిన తీరులో ఏపికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ వైకాపా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టింది. ఇందులో భాగంగా విశాఖ రామకృష్ణా బీచ్‌లో గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. ఈ నిరసన కార్యక్రమాని వివిధ విద్యార్థి సంఘాలు, పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయితే ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న తనే స్వయంగా వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొంటానని ప్రకటించారు. దీంతో నగరంలో పోలీస్ బందోబస్త్‌ను ముమ్మరం చేశారు. జగన్ నిరసన ప్రదర్శనను భగ్నం చేయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి నుంచే నగరంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు హౌజ్ అరెస్ట్ చేశారు. నగర శివారు ప్రాంతాల వద్ద పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులెవ్వరూ నగరంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన బందోబస్త్ నిర్వహించారు. నగరం అంతటా 144 సెక్షన్‌ను అమలు చేశారు. గురువారం ఉదయం నుంచి బీచ్ రోడ్డులోకి ఏ ఒక్కరినీ అనుమతించలేదు. బీచ్ రోడ్డులో కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతించారు. బీచ్ రోడ్‌లో నివసిస్తున్న వారిని కూడా ఇళ్ళ నుంచి బయటకు రానీయలేదు. పార్క్ హోటల్ నుంచి, కలెక్టరేట్, జిల్లాపరిషత్ నుంచి ఎవ్వరినీ బీచ్ రోడ్డులోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో బీచ్ రోడ్డులో అప్రకటిత కర్ఫ్యూ విధించినట్టయింది. ఇదిలా ఉండగా జగన్ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ నగరంలో వివిధ చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. స్థానిక ఎన్‌ఏడి జంక్షన్‌లో మాజీ కార్పొరేటర్ జియాని శ్రీ్థర్ ఎతె్తైన భవనం ఎక్కి, దానిపై నుంచి దూకేస్తానని బెదిరించారు. కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని, ప్రత్యేక హోదాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన నినాదాలు చేశారు.