ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో మహారాష్ట్ర అధికార బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 27: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికై చేపట్టిన భూ సమీకరణ పథకం అమలుపై అధ్యయనానికి మహారాష్ట్ర అధికారుల బృందం విచ్చేసింది. మహారాష్టల్రో చేపట్టనున్న రోడ్డు ప్రాజెక్టులు, స్మార్ట్ సిటీల నిర్మాణం కోసం చేయాల్సిన భూ సమీకరణకు గాను చేయాల్సిన ప్రక్రియపై అధ్యయనం కోసం శుక్రవారం నగరానికి చేరుకొన్న అధికార బృందానికి సిఆర్‌డిఎ అదనపు కమిషనర్ ఎ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు. దేశంలోనే జరిగిన ల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ విధానాలపై ఎల్పీఎస్, మాస్టర్ ప్లాన్ తయారీ తదితర అంశాలపై వివరించారు. రైతుల నుంచి భూములను సేకరించిన విధానం, చట్ట ప్రకారం రైతులకు కల్పించిన లబ్ధి, తదితర అంశాలను ఎస్టేట్స్ డైరెక్టర్ సిహెచ్ మోహనరావు వివరించగా లే అవుట్స్ తయారీ, ప్లాట్ల లాటరీ విధానం, మాస్టర్ ప్లాన్ తయారీ, ఇన్‌ఫ్రా ప్లాన్స్, ఫండింగ్, తదితర అంశాలను ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణారావు వివరించారు. మహారాష్ట్ర జలవనరుల శాఖ డెప్యూటీ సెక్రటరీ ఎస్‌ఎం నాగ్‌పూర్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ ఎస్‌ఇ ఎటి డియోగడే భండారా, ఇరిగేషన్ ఎస్‌ఇ ఆర్‌ఎస్ సొంటక్కే, నాగ్‌పూర్ ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఇ జెజి గవాలి, చంద్రాపూర్ ఇరిగేషన్ పి సర్కిల్ ఎస్‌ఇ కెఎస్ వేముల్కొండ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మహారాష్ట్ర అధికారులకు వివరిస్తున్న సిఆర్‌డిఎ అధికారులు