ఆంధ్రప్రదేశ్‌

జగన్ అవినీతిలో ‘సజ్జల’కూ వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 28: ప్రతిపక్షనేత వైఎస్ జగన్ లక్ష కోట్ల ఆస్తిలో ఆయన రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా వాటా ఉందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. సజ్జల కార్యదర్శిగా ఉన్నందునే జగన్ తప్పుడు, దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్నారని శనివారం ఒక ప్రకటనలో పల్లె విమర్శించారు. రాజకీయ కార్యదర్శులు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి తప్ప ఫ్యాక్షన్ వైఖరిని ప్రదర్శించరాదని హితవు పలికారు. దీనివల్ల జగన్ అభాసుపాలవుతున్నారని, ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసిపికి లేదన్నారు. వైఎస్ హయాంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్రతో సహా 250 మంది తెలుగుదేశం కార్యకర్తలను మట్టు బెట్టారని, కడప, పులివెందులలో వైఎస్ తండ్రి రాజారెడ్డి కుటుంబం ఎన్నో ఫ్యాక్షన్ హత్యలను ప్రేరేపించిందని ఆయన గుర్తుచేశారు.
అధికారం కోసం వైఎస్ హైదరాబాద్‌లో రగిలించిన చిచ్చు వల్ల 350 మంది వరకు మృత్యువాత పడ్డారన్నారు. అలిపిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై బాంబుదాడికి తెగబడిన గంగిరెడ్డిని, ఫ్యాక్షన్ దాడులకు పాల్పడే మంగలి కృష్ణ లాంటి వాళ్లు రెండు భుజాలుగా జగన్ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసులో సజ్జల సోదరుడు దివాకర్‌రెడ్డి 7వ ముద్దాయిగా ఉన్నారన్నారు. నేర చరి త్ర మచ్చుకైనాలేని ముఖ్యమంత్రి చం ద్రబాబును, కుటుంబాన్ని విమర్శించే స్థాయి వైసిపి నేతలకు లేదన్నారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కే జగన్‌కు రాజకీయంగా భయపడాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు.