ఆంధ్రప్రదేశ్‌

విజయవాడ - గుంటూరు మధ్య ఐకాన్ బ్రిడ్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 28: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో రూ.1.24 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు 62 అవగాహన ఒప్పందాలు కుదిరాయని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖలో రెండు రోజులుగా జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో శనివారం ఈ మేరకు పెట్టుబడిదార్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే అమరావతి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక భూమిక పోషిస్తోందని, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భాగస్వామ్య సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారన్నారు. విభజిత నవ్యాంధ్రలో అభివృద్ధికి దోహదమైన పారిశ్రామిక ప్రగతి జరగాలంటే వౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. దీనికోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అమరావతి చుట్టూ 186 కిలోమీటర్ల ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అనుమతించిందన్నారు.
విజయవాడ -గుంటూరు మధ్య చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారన్నారు. దీనికోసం రూ.250 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. అమరావతి నుంచి మూడు ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఆరులైన్ల రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ.3,400 కోట్లు ఖర్చు చేయనుందన్నారు. రాష్ట్రం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులను కలుపుతూ 3000 కిమీమేర రాష్ట్ర రహదార్లను అభివృద్ధి పరిచేందుకు కేంద్రం రూ.75వేల కోట్లను ఖర్చు చేయనుందన్నారు. ఆటంకాల్లేని ప్రయాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 300 రైల్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని భావించామని, దీనికి రూ.3,500 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా రహదార్ల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. అంతర్ జల రవాణాను ప్రోత్సహించే క్రమంలో బకింగ్‌హామ్ కాలువ విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. వౌలిక సదుపాయాలు మెరుగుపరిచడం ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని, తద్వారా తలసరి ఆదాయం రూ.1.07 లక్షల నుంచి రూ.1.5 లక్షలకు పెంచాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు.