ఆంధ్రప్రదేశ్‌

గురుకులాలుగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 29: రాష్ట్రంలోని గురుకులాలను దేశంలోనే మొదటి స్థానంలో నిలపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. నగరంలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగుల సమాఖ్య (ఎస్‌డబ్ల్యుఆర్‌ఇఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ గురుకులాలను అట్టడుగు వర్గాలకు విద్యను అందించేందుకు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు హయాంలో ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. 180 రెసిడెన్షియల్ స్కూళ్లను 5వేల మంది ఉపాధ్యాయులతో ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఏర్పాటు చేశారన్నారు. ఉపాధ్యాయులు సరైన విధంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడం వల్ల భవిష్యత్‌లో వారు రాష్ట్రానికి, దేశానికి పేరుప్రఖ్యాతులు తెచ్చేవిధంగా ఉపయోగపడతారన్నారు. గురుకులాల్లో చదువుకోడానికి వచ్చే విద్యార్థులు ఎక్కువగా పేదపిల్లలని, వీరికి నాణ్యమైన విద్య అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అందుకోసం రాష్ట్రంలో వున్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లన్నింటినీ రాబోయేకాలంలో గురుకులాలుగా మారుస్తున్నారని చెప్పారు. ఒక మోడల్ గురుకులాన్ని కుప్పంలో రూ.20 కోట్లతో నిర్మిస్తున్నామని, ఇందులో సకల హంగులు ఉంటాయన్నారు. భవిష్యత్‌లో గురుకులాలు ఆంధ్రప్రదేశ్‌కి పేరుప్రఖ్యాతులు తేవడానికి అవకాశం వుందని, ఉత్తమ విద్య, నైపుణ్య శిక్షణను ఇక్కడ అందుబాటులో వుంచనున్నట్లు చెప్పారు. మార్చిలోపు సాంఘిక సంక్షేమ హాస్టళ్లన్నింటిలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు రూ.2 కోట్లు చెల్లించామని, వీళ్లు మార్చిలోపు కనెక్టివిటీ ఇస్తామన్నారని తెలిపారు. ఇది పూర్తయితే ఏప్రిల్ నుంచి డిజిటల్ క్లాస్ రూముల ద్వారా విద్యను అందిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని ఒక్కోటి రూ.21 కోట్ల వ్యయంతో పూర్తి చేశామన్నారు. ముందుగా మంత్రి రావెల జ్యోతి వెలిగించి ఎన్టీ రామారావు, డా. బిఆర్ అంబేద్కర్, పూలే, జగ్జీవన్‌రామ్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ ఉద్యోగులకు అండగా ఎన్జీవో నాయకులు ముందుండి తమ సామాజిక బాధ్యతతో ముందుకు వెళుతున్నారని తెలిపారు. రాబోయేకాలంలో ఇదే స్ఫూర్తిని ఉద్యోగులు కొనసాగించాలని చెప్పారు. ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులు తమ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం వారిపైనే వుందన్నారు. ఉద్యోగ సంఘాల నేత అశోక్‌బాబు మాట్లాడుతూ తవ సమస్యలను పరిష్కరించడంలో మంత్రి తోడ్పాటు అందించాలని కోరారు.