ఆంధ్రప్రదేశ్‌

పఠనాసక్తి కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 31: ప్రజల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఎన్టీఆర్ ట్రస్టు సంయుక్తంగా విశాఖ ఎయు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఈ నెల 28 నుంచి నవ్యాంధ్ర పుస్తక సంబరాలు పేరిట పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖలో మంగళవారం పుస్తక ప్రియుల పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా లోకజ్ఞానం పెరుగుతుందన్నారు. పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రసార మాధ్యమాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రజలు పుస్తక పఠనానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్, ఇతర వ్యాపకాలతో బిజీగా గడుపుతున్న ప్రజలు తమలోని పఠనాసక్తిని కల్పోతున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లో పుస్తకాలే మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించాయన్న వాస్తవం మర్చిపోకూడదన్నారు. కార్యక్రమంలో ఎమెస్కో అధినేత దూపాటి విజయకుమార్, పలువురు పబ్లిషర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

చిత్రం..పుస్తక ప్రియుల పాదయాత్రలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు