ఆంధ్రప్రదేశ్‌

రూ.1000 కోట్ల టర్నోవర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 31: గిరిజన సహకార సంస్థ (జిసిసి ) 1000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులను విస్తృతంగా మార్కెట్ చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. జిసిసి ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. గిరిజన రైతులు దళారీల ద్వారా దోపిడీకి గురి కాకుండా జిసిసి కొనుగోళ్లు చేస్తున్నదన్నారు.
అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. పాడేరు కాఫీ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. 1400 టన్నుల కాఫీ గింజలను జిసిసి కొనుగోలు చేసిందని తెలిపారు. కాఫీ రైతులకు స్వల్ప కాలిక రుణాలు ఇస్తున్నామన్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 13 రకాల ఉత్తత్తులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆన్‌లైన్‌లో కూడా జిసిసి అమ్మకాలు చేస్తున్నదని గుర్తు చేశారు.