ఆంధ్రప్రదేశ్‌

అడుగడుగునా బిజెపికి అవమానాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 31: వందలు, వేల కోట్లతో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో నిబంధనల మేర గ్రామసభలు జరగాల్సి వుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పూర్తిగా ఇందుకు భిన్నంగా జరుగుతోందని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిత్రపక్ష తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిని తూర్పారపట్టారు. ఎంఎల్‌ఏల కనుసన్నల్లో ఏడెనిమిది మంది తెలుగుదేశం కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు వేసి వారిష్టానుసారం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని అన్నారు. ఒక ఇల్లు కావాలన్నా, గ్యాస్ కనెక్షన్ కావాలన్నా, ఒక పెన్షన్ రావాలన్నా బిజెపి నేతలు, కార్యకర్తలు దేబరించుకోవాల్సి వస్తున్నదన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలు, పోస్టర్లలో ప్రధాని నరేంద్రమోదీ, సంబంధిత కేంద్రమంత్రుల ఫొటోలు కన్పించడం లేదన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ మిత్రపక్షం కాకపోయినా పల్స్‌పోలియో పోస్టర్లలో మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెడ్దా ఫొటోలు దర్శనమివ్వడం ఎంతో సంతోషం కల్గించిందన్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో బిజెపికి అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయంటూ మండిపడ్డారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ఎంతో చేస్తూనే ప్రతి అంశంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సామర్థ్యాన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నప్పటికీ కనీసం ఆయన మంజూరుచేసిన ఇళ్లలో ఒక ఇంటిని అయినా బిజెపి నేతలు అడిగినవారికి ఇవ్వకపోవటం దారుణమన్నారు. పట్టణాలకు రెండు లక్షల గృహాలు, గ్రామాలకు మరో రెండు లక్షల గృహాలు మంజూరుకాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరో 25 శాతం పోను రాష్ట్రం భరిస్తుంది కేవలం 5 శాతం మాత్రమే అన్నారు. పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆలోచించడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రధాని, కేంద్రమంత్రుల ఫొటోలతో సరైన ప్రచారం లేకపోవటంతో ప్రతి ఒక్కరూ కేంద్రం ఈ రాష్ట్రానికి ఏమి చేసిందని ప్రశ్నిస్తూ విపక్షాల మాటలు విని ప్రత్యేక హోదా వంటి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని అన్నారు.
రాష్ట్ర విభజన కోసం తెదేపా సహా అన్ని పక్షాలు లేఖలు రాసినప్పటికీ బిజెపి ప్రధాన పాత్ర పోషించిందని చివరి సమయంలో అనేక లోటుపాట్లతో కూడిన విభజన బిల్లును ఆమోదించాల్సి వచ్చినా కేంద్రం సరిదిద్దే ప్రయత్నంలో నిమగ్నమై ఉందన్నారు. పోలవరం ముంపు మండలాల విలీనం, కేంద్ర సంస్థలు ఏర్పాటు, జాతీయ రహదారుల నిర్మాణం వంటివి శరవేగంతో జరుగుతున్నాయని అన్నారు. చట్టసభలో ప్రత్యేక హోదా కోసం వెంకయ్యనాయుడు పోరాడినప్పటికీ రాష్ట్రాలకు నిధుల కేటాయింపునకై నాడు ప్రధాని మన్మోహన్‌సింగ్ వేసిన కమిటీ నివేదిక ఆధారంగానే ‘హోదా’ సాధ్యపడటం లేదన్నారు. అయితే రాష్ట్రాలకు జనాభా ఆధారంగా సమానంగా నిధులు అందజేసే ప్రక్రియలో నిధుల కేటాయింపు 32 నుంచి 42 శాతంకు పెరిగిందన్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఏటా రూ.42వేల కోట్లు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా వల్ల చేకూరే రూ.3500 కోట్లను కేంద్రం సమకూరుస్తున్నది కదాఅని ఓ ప్రశ్నకు సమాధానంగా వీర్రాజు చెప్పారు. అయితే తమిళనాడులో సాంప్రదాయక క్రీడ జల్లికట్టుతో హోదాకు ముడిపెట్టి ఉద్యమాలు చేయడం తగదన్నారు. అలాగే ఉత్తర, దక్షిణాలుగా భారత్‌ను విడదీసి ప్రజల్లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టటం సరైంది కాదన్నారు. అసలు ఆనాడు పునర్విభజన బిల్లులో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంటే బిజెపి మినహా ఏ పార్టీ కూడా నోరు మెదపలేదన్నారు. చివరకు తెదేపా ఎంపిలు నోటికి నల్లగుడ్డ కట్టుకుని నిరసన తెలిపారు కానీ, ఏమి కావాలో కోరలేదన్నారు. ఏది ఏమైనా తొలుత హోదా గురించి మాట్లాడిన చంద్రబాబు నేడు ఏ విధంగా నోరు మెదపటం లేదో అలాగే ఇతర పక్షాల నాయకులు కూడా త్వరలో తెలుసుకోగలరన్నారు. విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు కూడా పాల్గొన్నారు.