ఆంధ్రప్రదేశ్‌

జిల్లా స్థాయిలో ప్రచార సమన్వయ కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 31: ప్రభు త్వం చేకూర్చే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు జిల్లాస్థాయిలో ప్రచార సమన్వయ కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో రాష్టస్థ్రాయి సమాచార, పౌర సంబంధాల శాఖ క్షేత్రస్థాయి అధికారుల సమావేశం, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం సంయుక్తంగా నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సమన్వయం చేసుకోవడం, ప్రజలకు చేర్చడంలో సమాచార శాఖ అధికారులు కీలకమైన బాధ్యత నిర్వర్తించాల్సి వుందన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంలో సమాచార శాఖ అధికారుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించి అభినందించారన్నారు. అదే తరహా పనితీరును సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేకూరుస్తున్న వాస్తవ ప్రయోజనాన్ని ప్రచార మాధ్యమాల ద్వారా చేరవేయాల్సి వుందన్నారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పనితీరు మెరుగుపరచుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాల పరిధిలో, రాష్టస్థ్రాయిలో విలేఖరులకు, డెస్క్‌లలో పనిచేసే సిబ్బందికి అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు అందించడంలో చొరవ చూపాలని, సమయానుకూలంగా స్పందించాలని మంత్రి పల్లె సూచించారు.
రాష్ట్రంలో ప్రగతి పథకాల అమలులో భాగస్వామ్యమైన ముఖ్య శాఖల ద్వారా చేకూర్చుతున్న విజయగాథలను అనుసంధానిస్తూ ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుచేయాలని మంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సమాచార శాఖ సమన్వయ కమిటీల అధికారులతో ఎప్పటి సమాచారం అప్పుడు క్రోడీకరించుకోవాల్సి వుందన్నారు. ఆయా జిల్లాల్లో మంత్రుల పర్యటన సందర్భంలో వారి శాఖలకు చెందిన ప్రగతి సూచికలను నివేదికల రూపంలో అందించడం ద్వారా పనితీరు చూపించాలని మంత్రి కోరారు. ఎంహెచ్‌ఆర్‌డి ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి నుండి గ్రామస్థాయి వరకు ఉచిత వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. క్షేత్రస్థాయి సమావేశంలో భాగంగా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియలో 13 జిల్లాల అధికారులతో, అమృత ఈ-లెర్నింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ కమల్ బిలాజానితో మాట్లాడుతూ త్వరలోనే ఈ ప్రక్రియను గ్రామస్థాయిలోని పంచాయతీ వరకు తీసుకెళతామని చెప్పారు. అదే తరహాలో మొబైల్ టెక్నాలజీకి కూడా ఈ యాప్‌ను అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టామని రఘునాథరెడ్డి వివరించారు.
సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, మీడియా లైజనింగ్ అధికారులు వారు చేసే పనుల ప్రగతి సూచికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందజేయాలని సూచించారు. తద్వారా వారి పనితీరును పరిగణనలోకి తీసుకుని మరింత విస్తృత స్థాయిలో సాంకేతికపరమైన విధివిధానాలను అమలు చేయడం ద్వారా ఎప్పటి వార్తలు అప్పుడు ప్రజలకు మీడియా ద్వారా అందించగలుగుతామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు డైరెక్టర్ డి శ్రీనివాస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఒ మధుసూదన్, ఇతర ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొని తమ సూచనలు, సలహాలు అందజేశారు.