ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ నిర్వాకం వల్లే ‘పులిచింతల’ జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 31: కాంగ్రెస్ పార్టీ విధానాల వల్లే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి తమ ప్రభుత్వం 541 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ నేతల కమీషన్ల కక్కుర్తి వల్లనే ప్రాజెక్టు పూర్తయ్యేందుకు పదేళ్ల కాలం పట్టిందన్నారు. కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. పట్టిసీమ వల్ల కృష్ణాడెల్టాలో 6 వేల కోట్ల రూపాయల పంట పండిందని గుర్తుచేశారు. పట్టిసీమ దండుగన్న ప్రతిపక్ష నేత మూర్ఖుడని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతో బడ్జెట్‌పై చర్చించినట్లు తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో తమ శాఖ ద్వారా ఇప్పటికే 7833 కోట్ల రూపాయలు ఖర్చుచేశామని, మరో 3 వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయల మేరకు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు, గేట్ల పనులను ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభిస్తారని మంత్రి ఉమ వివరించారు.