ఆంధ్రప్రదేశ్‌

6న ఉరవకొండలో వైఎస్ జగన్ జలదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 31: వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 6న అనంతపురం జిల్లా ఉరవకొండలో జలదీక్ష చేపట్టబోతున్నారు. హంద్రీ నీవా ద్వారా ఉరవకొండ, పరిసర మండలాల్లోని 80 ఎకరాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి జగన్ జలదీక్ష చేపడుతున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. రైతులకు పంట నష్ట పరిహారం ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని, గుంతకల్లు బ్రాంచి కెనాల్ ఆధునికీకరణ పనులు చేపట్టాలని, చేనేతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హంద్రీ నీవా ద్వారా అనంతపురం జిల్లాకు 33 టిఎంసిల నీటిని సరఫరా చేసినా, కనీసం 33 ఎకరాలకు కూడా సాగు నీరివ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. జలదీక్ష ద్వారా హంద్రీ నీవా నీటిని సాధించుకుంటామని వైకాపా నేతలు స్పష్టం చేశారు. జలదీక్షను రైతన్నలు విజయవంతం చేయాలని వారు కోరారు. జలదీక్ష ఏర్పాట్లలో వైకాపా శ్రేణులు తలమునకలయ్యాయి. రైతులను భారీగా తరలించేందుకు ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.