ఆంధ్రప్రదేశ్‌

‘అమృత్’ పథకానికి రూ.1,350 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక పట్టణ వౌలిక సదుపాయాలను కల్పించేందుకు రానున్న మూడు సంవత్సరాల్లో రూ. 1,350 కోట్ల పెట్టుబడులు పట్టేందుకు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల కోసం కేంద్రం వాటా కింద 405 కోట్లు ఇచ్చేందుకు పట్టణాభివృద్ది శాఖ ఆమోదం తెలిపింది. అమృత్ పథకం కింద ఏపీలోని 32 పట్టణాల్లో మంచినీటి సరఫరా, సివరేజ్ నెట్‌వర్క్, డ్రైనేజీ, ఉద్యాన వనాలు, ఖాళీ స్థలాల ఏర్పాటుకు ఖర్చు చేస్తారు. 1350 కోట్లలో నుండి 863 కోట్లతో పట్టణ ప్రాంతాలలోని అన్ని ఇళ్ళకు మంచినీరు సరఫరా చేయటంతోపాటు ప్రతి ఒక్కరికీ 135 లీటర్ల నీరు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. 261 కోట్ల రూపాయల వ్యయంతో సివరేజ్ పథకాలు, 195 కోట్లతో డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. 32 కోట్ల రూపాయలను పార్కులు, ఖాళీ స్థలాల ఏర్పాటుకు కేటాయించారు. చిత్తూరులో 122 కోట్లు, నెల్లూరులో 117 కోట్లు, నంద్యాలలో 95 కోట్లు, ప్రొద్దుటూరులో 91 కోట్లు, హిందుపూర్‌లో 86 కోట్లు, తాడిపత్రిలో 81 కోట్లు, కడపలో 81 కోట్లు, ఒంగోలులో 77 కోట్లు, చిలకలూరిపేటలో 76 కోట్లు, తిరుపతిలో 66 కోట్లు, కాకినాడలో 66 కోట్లు, కర్నూలులో 51 కోట్లు, విశాఖపట్నంలో 48 కోట్లు,విజయనగరంలో 43 కోట్లు,రాజమండ్రిలో 31 కోట్లు,శ్రీకాకుళంలో 23 కోట్లు, గుంతకల్‌లో 20 కోట్లు, తాడేపల్లిగూడెంలో 20 కోట్లు, ఆదోనిలో 19 కోట్లు, శ్రీకాళహస్తిలో 16 కోట్లు, ధర్మవరంలో 16 కోట్లు, ఏలూరులో 14 కోట్లు, మదనపల్లెలో 11 కోట్లతో ఈ పనులు చేపడతారు.
సమస్యలు పరిష్కరిస్తాం
న్యూఢిల్లీ: ప్రభుత్వ అడ్వర్‌టైజ్‌మెంట్ రేట్లు పెంపు, న్యూస్‌ప్రింట్ ధరలు తగ్గించాలన్న దినపత్రికల యాజమాన్యాల డిమాండ్‌ను పరిశీలించి ఓ పరిష్కారం కనుగొంటామని కేంద్రం వెల్లడించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రి ఎం వెంకయ్యనాయుడు గురువారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పత్రికారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. ఈ ఉదయం న్యూస్‌పేపర్స్ సొసైటీ ప్రతినిధుల బృందం తనను కలిసి మెమోరాండం ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని సొసైటీ ప్రతినిధులకు చెప్పినట్టు ఆయన సభకు తెలిపారు. డిఏవిపి ద్వారా జారీ అయ్యే ప్రభుత్వం రంగ సంస్థల ప్రకటనల రేట్ల విషయం తమ దృష్టికి తెచ్చారని ఆయన అన్నారు. న్యూస్‌ప్రింట్ ధరలు సహా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారని స్పష్టం చేసిన వెంకయ్య వాటిపై సమాచార ప్రసార విభాగం కార్యదర్శిని ఆదేశించామని వెల్లడించారు.