ఆంధ్రప్రదేశ్‌

రాజధాని కేసు నేటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్లు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం ఈ పిటిషన్లపై ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్‌తో కుడిన ధర్నాసనం విచారణ జరిపింది. పిటిషన్ల తరపున న్యాయవాది రిత్విక్ దత్త వాదనలు వినిపిస్తూ పర్యావరణ అనుమతులు మంజురు చేయడానికి ఎలాంటి పారదర్శకత పాటించలేదన్నారు. కొండవీటి వాగుకు వరదలొస్తే ప్రతిపాదిత రాజధాని ప్రాంతానికి ముప్పు ఉంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.