ఆంధ్రప్రదేశ్‌

సింగిల్ టీచర్ స్కూళ్లు 8662

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్‌లో 8662 స్కూళ్లు ఏకోపాధ్యాయులతోనే పనిచేస్తున్నాయి. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపించిన నివేదికలో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 11.05 లక్షల స్కూళ్లు ఉండగా, అందులో 97,923 స్కూళ్లు ఏకోపాధ్యాయులతోనే పనిచేస్తున్నాయి. ఉపాధ్యాయులను నియమించాల్సిన బాధ్యత రాష్ట్రాలకే ఉండటంతో కేంద్రం ఆర్ధిక నిధులను సమకూర్చడం మినహా ఏ విధమైన ఒత్తిడిని తీసుకురాలేకపోతోంది. సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకాల కింద ప్రతి ఏటా కోట్లాది రూపాయిలను అందిస్తోంది. విద్యార్ధి, ఉపాధ్యాయుల నిష్పత్తిని నిర్వహించాల్సిన బాధ్యత కూడా రాష్ట్రాలకే దఖలు కావడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.