ఆంధ్రప్రదేశ్‌

అమరావతి పేరుతో కొత్త రిజిస్ట్రేషన్ జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 2: అమరావతి పేరుతో కొత్త రిజిస్ట్రేషన్ జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కెఇ కృష్ణమూర్తి తెలిపారు. తుళ్లూరులో కొత్తగా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా శుక్రవారం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమరావతి రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో తుళ్లూరు, అనంతవరం, ఉండవల్లి మండలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుంటాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్ కాలువ విస్తరణ, కాలువను ఆనుకొని ఉన్న 106 మైనర్ ఇరిగేషన్ చెరువులను నింపే విషయంపై చర్చించినట్లు తెలిపారు. చెరువులు నింపడం వల్ల గ్రామాల్లో తాగు , సాగు నీరుకు ఇబ్బంది లేకుండా చేయవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రస్తుతం పురోగతిలో ఉన్న పందికోన, సిద్ధాపురం, పులికుర్తి స్కీములను మార్చినాటికి పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. దీనివల్ల జిల్లాలో కొత్తగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చని , మరో 50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని కరువురహితంగా తీర్చగలమన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రిజిస్ట్రేషన్ శాఖపై ప్రభావం పడిందని, దీనిని సరిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం 5 వేల 180 కోట్లు టార్గెట్ నిర్దేశించగా ఇప్పటివరకు 2 వేల 932 కోట్ల 28 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. రాజధాని ప్రాంతంలో భూయాజమాన్య విషయంలో తప్పులు దొర్లకుండా సిఆర్‌డిఎ సమాచారాన్ని, రిజిస్ట్రేషను సమాచారంతో మరియు ఆధార్ అనుసంధానంతో విలీనం చేసి రిజిస్ట్రేషను చేపట్టడం జరుగుతుందన్నారు. నకిలీ రిజిస్ట్రేషన్లు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నామన్నారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌తో పాటు కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ్ మోహన్, ఎస్పీ రవికృష్ణ, ఇతర ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.