ఆంధ్రప్రదేశ్‌

హోదా ఇవ్వాలని బైక్ ర్యాలీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్‌కు అత్యంత కీలకమైన విభజన హామీలతో కూడిన ప్రత్యేక హోదా అమలుకోసం చింతా రాజశేఖర్ అనే యువకుడు సోషల్ మీడియా మిత్రులు కొందరితో కలిసి 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రాజశేఖర్ తాను చేపట్టే బైక్ ర్యాలీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. 10వ తేదీ ఇచ్ఛాపురంలో ర్యాలీ మొదలుపెట్టి రాయలసీమ ప్రాంతాన్ని చుట్టి 21వ తేదీ గుంటూరు చేరి ముగిస్తామన్నారు. పరీక్షలు లేని విద్యార్థులు, యువకులు ఎవరైనా పాల్గొనదలిస్తే 21 ఏళ్ల పైబడి హెల్మెట్‌తో సహా ఒక ద్విచక్ర వాహనం లేదా కారు వాటికి సంబంధించిన పత్రాలతో వారివారి జిల్లాల్లో పాల్గొనవచ్చన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికుల గౌరవార్థం చలికాలంలోనూ తాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించానని, లాతూర్‌కు లక్ష గొంతులకు పైగా దాహార్తి తీర్చేలా మంచినీరు పంపిణీ చేశామని, ఇస్రో ప్రయోగాల పట్ల యువతలో ఆసక్తి నింపేందుకు సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఆడియోల ద్వారా చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశామన్నారు. ఈ ర్యాలీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు ప్రకటించారు.