ఆంధ్రప్రదేశ్‌

రాజధానిలో దళితులకు తీరని అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దళితులకు తీరని అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వమే వీరి పట్ల వివక్ష చూపుతుంటే వీరి బతుకులు ఏమికావాలంటూ గురువారం ఇక్కడి సబ్ కలెక్టరేట్‌లో విచారణ చేపట్టిన ఎస్సీ జాతీయ కమిషన్ చైర్‌పర్సన్ కమలమ్మ ఎదుట వివిధ పక్షాలు, సంఘం ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒకదశలో కమలమ్మ అధికారుల వైఖరి పట్ల అసహనానికి గురై రాజధాని ప్రాంతంలో దళితులను నివసించనీయరా? అంటూ ప్రశ్నించారు. సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ చిగురుపాటి బాబూరావు, రాజధాని కమిటీ కార్యదర్శి ఎం రవి నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం, రాజధాని ప్రాంత రైతులు, రైతుకూలీల పరిరక్షణ సమితి కన్వీనర్ అనుమోలు గాంధీ, ప్రముఖ న్యాయవాది దళిత నేత సిరిపురపు ఫ్రాన్సిస్ నేతృత్వంలో మరో ప్రతినిధి బృందం కమిషన్‌ను కలిసి వేర్వేరుగా వివిధ అంశాలను ప్రస్తావించారు. ‘దాదాపు 6వేల ఎకరాల అసైన్డ్, లంక భూముల్లో దళితులు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. వారికి జీవనాధారం కూడా అదే. అయితే వీరి భూముల స్వాధీనం కోసం ఇతరులతో సమానంగా ప్యాకేజీ ప్రకటించకుండా 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేలా సరికొత్తగా జీవో-41ను జారీచేశా’రంటూ ఫిర్యాదు చేశారు. వీరికి పట్టాలు లేకపోయినా సమాన ప్యాకేజీ ఇవ్వాలన్నారు. అగ్రవర్గాల వారు కారుచౌకగా కొనుగోలు చేసిన అసైన్డ్, లంక భూములను తిరిగి అప్పగించాలన్నారు. ఇతరులకు కేటాయించిన ప్రాంతాల్లో దళితులకు కూడా ప్లాట్లు కేటాయించాలన్నారు. వారి ఇళ్లపై ఉన్న రుణాలు రద్దుచేసి రిజిస్ట్రేషన్ హక్కుపత్రాలు ఇవ్వాలని, ఇసుక క్వారీల్లో యంత్రాలను నిషేధించి దళితులకు అప్పగించాలని కోరారు. రహదారుల వెడల్పు, అభివృద్ధి పేరిట గ్రామాల్లో దళితుల ఇళ్లను తొలగించవద్దని కోరారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయిపాలెం, తదితర గ్రామాలను పూర్తిగా తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తపర్చారు. వ్యవసాయంపై ఆధారపడ్డ దళిత కూలీలకు నెలకు అందిస్తున్న రూ. 2500ల పరిహారం ఏమాత్రం సరిపోదని కూడా ఆయా సంఘాల ప్రతినిధులు ఎస్సీ కమిషన్ దృష్టికి తెచ్చారు.