ఆంధ్రప్రదేశ్‌

6 నుంచి కాకినాడలో లక్ష గో పిడకల యజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్టస్థ్రాయి 5వ లక్ష గోపిడకల యజ్ఞం, సప్తగోమాత, తులసీ మాతలకు లక్ష ప్రదక్షిణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య తెలియపారు. కాకినాడ నగరంలోని ఆనందభారతి మైదానంలో 6వ తేదీ నుండి ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ యజ్ఞాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. గోమాతను తల్లిగా పూజించినంత కాలం మన పూర్వీకులు సమస్యలు లేకుండా, ఆరోగ్యంతో జీవించేవారన్నారు. ప్రస్తుత సమాజం గోపూజను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోమాతను, గోమయాన్ని విస్మరించి, పంటలను విషపూరితమైన రసాయనాలతో పండిస్తూ అనారోగ్యానికి గురవుతున్నామని పేర్కొన్నారు. గోవును, గోసంపదను మనిషికి దగ్గర చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఈ యజ్ఞానికి పెద్ద ఎత్తున రైతులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మనకు పూర్వవైభవం రావాలంటే ప్రతిఒక్కరు గోమాతను పోషించాలని లేక గోమాతను పోషించేవారికి సహకరించాలని కోరారు.