ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ఉద్యోగ సంఘాల్లో చీలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 5: ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ఎపి ఎన్‌జిఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నందున ఉద్యోగ సంఘాలు నూతన జెఎసి ఏర్పాటు చేసుకున్నాయ. ఉద్యోగ సంఘాల నూతన జెఎసి చైర్మన్‌గా ఎన్నికైన బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ, అశోక్‌బాబు ఏకపక్షంగా వ్యవహరించడంతోపాటు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించానికి సిద్ధంగా ఉన్నా సైంధవుడిలా అడ్డుపడి జెఏసి లక్ష్యానే్న భ్రష్టు పట్టించారని అన్నారు. ఆదివారం తిరుపతిలోని రెవెన్యూ భవన్‌లో 73 ఉద్యోగ సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఏపి నూతన జెఏసికి శ్రీకారం చుట్టారు. 13 జిల్లాల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు. నూతన జెఏసి ఆవిర్భావ సమావేశానికి వందల సంఖ్యలో వస్తారని నిర్వాహకులు భావించారు. అయితే వేల సంఖ్యలో ఉద్యోగులు, సంఘాల నేతలు, మహిళలు తరలిరావడంతో నూతన జెఏసి ఎంపిక అట్టహాసంగా సాగింది. ముందుగా ఉద్యోగ సంఘాల నేతల ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా బొప్పరాజకు మద్దతు పలకడంతోపాటు ఆయన నాయకత్వానికి మద్దతు పలుకుతూ నినాదాలు చేశారు. జెఏసి చెర్మన్‌గా బొప్పరాజు పేరును రాష్ట్ర ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణరాజు ప్రతిపాదించారు. ఇందుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేఖరులతో మాట్లాడుతూ, ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం నాయకత్వ లోపం ఏర్పడటంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఇక్కడకు వచ్చిన సంఘాల నేతలంతా జెఏసిలో ఉన్నవారేనని అన్నారు. అనేక కొత్త సంఘాలు కూడా నేడు నూతన జెఏసిని కోరుకున్నాయన్నారు. డాక్టర్లు, న్యాయ, విద్యుత్, అటవీశాఖ, సిపిఎస్, ఇలా అనేక సంఘాలు అప్పటి జెఏసిలో లేవని అన్నారు. తాను రాష్ట్ర రెవెన్యూ శాఖకు అధ్యక్షుడిగా ఉంటూ అనేక సమస్యల పరిష్కారానికి జీవోలు తీసుకువచ్చానని అన్నారు. విఆర్వోల దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారన్నారు. ఆ పరిస్థితిని చూశాకే తన వద్దకు వచ్చి నూతన జెఏసిని పెట్టాలని కోరారని అన్నారు. పాత నాయకత్వంలో మార్పులు వస్తాయని వేచి చూసే ధోరణితో వ్యవహరించామని ఆయన చెప్పారు.
నేడు పది మంది ఉద్యోగులు చేయాల్సిన పనిని ఒక్కరే చేస్తున్నారన్నారు. అందుకు కారణం ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల మేర ఉద్యోగాలు భర్తీ కాకపోవడమేనని అన్నారు. ఈ పరిస్థితిని గుర్తించి రెవెన్యూ శాఖలో 250 సర్వేయర్లు, 690 జూనియర్ అసిస్టెంట్లు నియామకాలు చేశామన్నారు. అలాగే ఇతర విభాగాల్లో కూడా ఉద్యోగ నియామకాలు చేసేందుకు ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్, కంటెంజెంట్ కార్మికులు చాలీచాలని జీతాలతో అల్లాడిపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేలా డెత్ కం గ్రాట్యుటి, ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఒప్పించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. హెల్త్‌కార్డులు మంజూరులో కూడా జాప్యం జరుగుతోందన్నారు. మహిళలకు చైల్డ్ కేర్ కింద 60 రోజులు సెలవులు ఉంటాయని వాటిని పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇక విభజన నేపధ్యంలో అనేక శాఖల విభాగాధిపతులు అమరావతికి బదిలీతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈక్రమంలో సిఎం చంద్రబాబునాయుడు మహిళలకు ప్రత్యేక వసతి కల్పించారన్నారు. అయితే హెచ్‌ఓడిలు ప్రభుత్వం అంగీకరించినా తీసుకోలేదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంలో అవసరమైతే ఇప్పుడున్న ఏపి ఎన్‌జిఓ నాయకులతో కలసి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
తాను ఎమ్మెల్సీ పదవి కోరానని, అది కాదన్నందుకే నూతన జెఏసి ఏర్పాటు చేస్తున్నట్లు తప్పడు ప్రచారం చేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తనకలాంటి కోరికలు లేవని, తన స్థాయి ఏమిటో తనకు తెలుసన్నారు. ఉద్యోగ సంఘ నేతలను బెదిరించే ధోరణి విడనాడాలని ఆయన అశోక్‌బాబుకు హితవు పలికారు. రాష్ట్రంలో రెండు జెఏసిలు ఉన్నట్లేనా? అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ ఏర్పడిన జెఏసి తలుపులు గడియపెట్టుకుని ఏర్పాటైంది కాదని, బహిరంగంగా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకున్న జెఏసి అన్నారు. ఇదే నిజమైన జెఏసి అన్నారు. ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తారా? అని ప్రశ్నించినప్పుడు ఇందుకు సంబంధించి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. ఇప్పుడు కూడా కేంద్రం, రాష్ట్రానికి ఏమైతే హామీలిచ్చిందో వాటిని నెరవేర్చుకోవడానికి రాజకీయ పార్టీలు ఎంతో ప్రయత్నిస్తున్నాయని వారు విఫలమైతే ప్రజల కోసం పోరాడతామన్నారు. ఈసమావేశంలో 13 జిల్లాల సంఘాల నాయకులు, టివి ఫణిరాజ్, నరసింహులు నాయుడు, కోలా శ్రీనివాసులు, సత్యనారాయణ, జగదీశ్వర్‌రెడ్డి, విజయేంద్రనాథ్, డిజి ప్రసాద్, జి.శ్రీరాములు, రవికుమార్, యోగీశ్వర్‌రెడ్డి, భాగ్యలక్ష్మి, మోహన్‌కుమార్, కృష్ణమోహన్, డాక్టర్ జగదీష్, టిటిడి ఉద్యోగ సంఘం మహిళ నాయకురాలు ఇందిర, శ్రీనివాసులు, డాక్టర్ నయనానంద కుమార్, బుచ్చిరాజు పాల్గొన్నారు.

చిత్రం..మాట్లాడుతూన్న నూతన జెఎసి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు