ఆంధ్రప్రదేశ్‌

కూనేరు ఘటనలో క్లూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: కూనేరు వద్ద సంభవించిన రైలు ప్రమాద సంఘటనలో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. కీలకమైన ఆధారాలు ఒక్కొక్కటీగా లభిస్తున్నాయి. దర్యాప్తు లోతుగా జరుగుతున్నందున త్వరలోనే మిస్టరీ వీడనుంది. రైలు ట్రాక్ మారినపుడు కలిపే జాయింట్ సమీపాన పట్టా విరిగిపోవడంతోనే ప్రమాదం జరిగిందనేది స్పష్టమవుతోంది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ రైల్వే మార్గంలో నిర్వహణ పనులు చేపట్టకపోవడం, పర్యవేక్షణాలోపం వంటివి ప్రధాన కారణాలుగా రైల్వేవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏమాత్రం పగిలి ఉన్నట్టుగా గుర్తించినా అక్కడ వెల్డింగ్ చేసి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగి ఉండేదికాదని ఈ వర్గాలు అంటున్నాయి. ఇదే రైల్వేట్రాక్‌పై అధిక లోడ్‌తో వెళ్ళిన గూడ్స్ వలన ప్రమాదం జరగకపోవడం ఆ మరుక్షణంలోనే వచ్చిన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం వరుసగా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు సంఘటనల మధ్య లభించే ఆధారాలే కీలకం కానున్నాయి. జనజీవనం సాగని కూనేరు రైల్వేస్టేషన్‌తోపాటు, పరిసరాల్లో సైతం ఎపుడూ స్తబ్థతగా ఉండే పరిస్థితులుండగా, ఇక్కడ పనిచేసే రైల్వే సిబ్బంది నుంచే సంఘటన మిస్టరీ వీడాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయని మావోయిస్టులు, ఉగ్రవాదుల దుశ్చర్యకు పాల్పడలేదనేది మొదట్లోనే తేలిపోయింది. అందువల్ల ఏ విధంగా చూసినా ఇది వాల్తేరు డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ సెక్షన్‌కు సంబంధించిన ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్యమే కారణమనే కోణంలోనే దర్యాప్తు సాగుతోంది. ఇది ఇపుడిపుడే పురోగతి సాధిస్తుండడంతో త్వరలో ఈ సంఘటనలో మిస్టరీ వీడనుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. గత నెల 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో కూనేరు రైల్వేస్టేషన్ సమీపాన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన సంఘటనపై సిఐడి, ఎన్‌ఐఏ, డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ, రైల్వే సేఫ్టీ కమిషనర్ వేర్వేరుగా దర్యాప్తులు నిర్వహిస్తూనే ఉన్నాయి. సంఘటన జరిగిన మరుసటి రోజున విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో డివిజన్ అధికారులు, ప్రయాణికులతో విచారణ నిర్వహించారు.