ఆంధ్రప్రదేశ్‌

విపక్షాల కుట్రల్ని సమర్థంగా ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 6: అధికారం కోసం కులం, మతం, వర్గాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ప్రతిపక్షం చేస్తున్న కుట్రలు నెరవేరవని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో రూ.4.30 కోట్లతో నిర్మించనున్న 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి సోమవారం తన మామ, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం తెలుగుదేశం పార్టీ ధ్యేయమైతే అసాంఘిక ప్రతిపక్షం దురుద్దేశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజన అనంతరం రాష్ట్రం రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్నప్పటికీ సమస్యలు ఉత్పన్నం కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. ఇందుకు సహకరించాల్సిన ప్రతిపక్షం మాత్రం అధికారం కోసం కులం, మతం, వర్గాన్ని పావులా వాడుకుంటోందని ఆరోపించారు. అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ మారుతుందన్నారు. ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా ఇటీవల విశాఖపట్నంలో పార్టనర్‌షిప్ సమ్మిట్ జరిగిందన్నారు. దీనిద్వారా విదేశీ సంస్థలు 10 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయని, ఫలితంగా 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే రాజకీయంగా ప్రత్యేక హోదా అంశంతో ప్రతిపక్షాలు రభస చేస్తున్నాయన్నారు. హోదా రావాలి, కావాలి అని తొలిగా కోరింది చంద్రబాబేనన్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచన మేరకు జిఎస్టీ కింద లబ్ధి చేకూరుతుందని, ఆ దిశగా ప్రత్యేక ప్యాకేజీ చట్ట్భద్రతకు చంద్రబాబు కృషి చేస్తున్నారని లోకేష్ వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల నారాయణరావు, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..నిమ్మకూరులో 30 పడకల ప్రభుత్వాస్పత్రి నిర్మాణానికి శంకుస్థానప చేస్తున్న బాలకృష్ణ, లోకేష్, మంత్రులు