ఆంధ్రప్రదేశ్‌

సంగీత నృత్యాల సంగమ వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 8: నదులే కాదు.. జాతీయ, అంతర్జాతీయ సంగీతాలూ అనుసంధానం కానున్నాయి.. అనేక నాట్యాలు ఒకే వేదిక మీద సవ్వడి చేయనున్నాయి. కృష్ణా జిల్లా కొండపల్లి సమీపాన ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు అమరావతి విశ్వసంగీత, నృత్య వేడుక జరగనుంది. రాజధాని అమరావతికి ప్రాచుర్యం కల్పించటం, ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ నృత్యం కూచిపూడి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతలను ప్రతినిధులను పరిచయం చేయటం అమరావతి విశ్వసంగీత, నృత్య వేడుక ఉద్దేశం. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు ఆతిథ్యమిస్తూనే పర్యాటకం, కళా సాంస్కృతిక రంగాల ప్రత్యేకతలను చాటిచెప్పనుంది. ఈ నెల పదోతేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సుందరరామ శ్రోతిగల్ బృందం వారిచే సామవేద పఠనం, సాయంత్రం గోనుగుంట్ల సోదరులు సాయిబాబు, నాగరాజుల నాదస్వర కచేరీ ఉంటుంది. సాయం త్రం ఆంధ్రప్రదేశ్ తనదంటూ సగర్వంగా చాటుకునే కూచిపూడి కళా ప్రాంగణం నుంచి వచ్చిన సుప్రసిద్ధ నర్తకి వైజయంతి కాషి కృష్ణమ్మకు నృత్యహారతి ఇస్తారు. రాత్రి పద్మవిభూషణ్ పండిట్ బిర్జు మహరాజ్ కథక్, విఖ్యాత వయోలిన్ విద్వాంసుడు ఎల్.సుబ్రహ్మణ్యం కచేరీ ఉంటుంది. పదకొండో తేదీ శనివారం సాయంత్రం వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య కీర్తనలపై వివేక్ సదాశివం ప్రత్యేక కార్యక్రమం, సాయంత్రం వైణికురాలు డా.మాధురీదేవి ‘నవరస వీణ’, రాత్రి చలనచిత్ర నేపథ్యగాయని కవితా కృష్ణమూర్తి బృందం లైవ్‌షో ఉంటుంది. అదేరోజు రాత్రి కృష్ణాతీరంలో అనూప్ జలోటా భజన కార్యక్రమం ఉంటుంది. జానపద కళల్ని దేశవిదేశాల్లో చాటుతున్న పూర్ణదాస్ బాల్, విఖ్యాత గాయకుడు సురేష్ వాడేకర్ కచేరీ ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగ విన్యాసం, వికు వినాయకరామ్, స్వామినాథన్‌ల ఘట విన్యాసాలు, రాత్రి విఖ్యాత తబలా వాద్య విద్వాంసులు అనిందో - అనుబ్రతా చటర్జీల వాద్యగోష్టి ఉంటుంది. వీటితోపాటు శివమణి వాద్య విన్యాసం ఉంటుంది. ముగింపురోజయిన సోమవారం సాయంత్రం చాహు నృత్యం, ద్వారం దుర్గాప్రసాద్, సత్యనారాయణరావు వయొలిన్ కచేరీ ఉంటుంది. జలతరంగ్ వాద్యంపై మంగళంపల్లి దీప్తి మంత్రముగ్ధులను చేయనున్నారు.