ఆంధ్రప్రదేశ్‌

బద్వేల్‌సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుపై ఏసిబి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 11: కడప జిల్లా బద్వేలు సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది సోమవారం ఎసిబి వలలో చిక్కారు. ఏసిబి డిఎస్పీ నాగరాజు నేతృత్వంలో బద్వేలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై మెరుపుదాడి నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్, సిబ్బందిని లంచం సొమ్ముతో అదుపులో తీసుకున్నారు. లెక్కలు లేకుండా సుమారు రూ.50వేలు నిల్వవుండగా, స్వాధీనం చేసుకుని వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. గత కొంతకాలంగా బద్వేలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఫిర్యాదులు ఉండటంతో సోమవారం ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. సబ్‌రిజిస్ట్రార్ స్వామి, సిబ్బందిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బద్వేలులో డికెటి , పోరంబోకు ,గ్రామకంఠం భూములకు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయ.