ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం దృష్టికి గల్ఫ్ కార్మికుల కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 9: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ నానా అవస్థలు పడుతున్న తెలుగు కార్మికుల వెసులుబాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సమాచార, ఎస్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మాయమాటలతో గల్ఫ్ దేశాలకు కార్మికులను తరలిస్తున్న లైసెన్స్ లేని ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ దిశగా అనంతపురం జిల్లా సహా అనేక జిల్లాల్లో నకిలీ ఏజెంట్లపై కేసులు నమోదై విచారణ కొనసాగుతోందన్నారు. గల్ఫ్ దేశాల చట్టాలపై, అక్కడి నిబంధనలపై ఏజెంట్లు సరైన అవగాహన కల్పించడం లేదని, కార్మికులు కూడా పెద్దగా చదువు లేకపోవడంతో దళారుల మోసాలకు సులభంగా ఆకర్షితులు అవుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లేవారు తప్పనిసరిగా ఎస్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలోని వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, లేదా ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దళారుల చేతిలో మోసపోయి, వివిధ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న వారిని, తిరిగి స్వగ్రామాలకు చేరుకోవాలనుకుంటున్న వారందరినీ ఆదుకోవాలని ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖకు అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. త్వరలోనే మరోసారి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఎస్‌ఆర్‌ఐ సమస్యలపై ఢిల్లీలో భేటీ కానున్నట్లు మంత్రి పల్లె తెలిపారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు ఆయా దేశాల్లోని చట్టాలపై కనీస అవగాహన కల్పించేందుకు త్వరలోనే ప్రచార కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
నకిలీ ఏజెంట్లు, దళారులపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసే విషయమై డిజిపి సాంబశివరావుతో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి మంత్రు లు, అధికారులతో కూడిన బృందం ఒకటి త్వరలోనే గల్ఫ్ దేశాల్లో పర్యటించనుందని, గత నెలలోనే పర్యటించాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడిందన్నారు.