ఆంధ్రప్రదేశ్‌

‘స్థానిక’ సంకటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 9: అధికార- ప్రతిపక్షానికి స్థాని క సంస్థల ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. వచ్చేనెల లో శాసనమండలికి వివిధ రూపాల్లో వరసగా జరగను న్న ఈ ఎన్నికల్లో, విజయం కోసం తెలుగుదేశం- వైసీపీ శక్తులు ఒడ్డుతున్నాయి. అయితే ప్రస్తుతం తమకున్న కొనసాగించేందుకు వామపక్షాలు చాపకింద నీరులా ఎన్నికల బరిలోకి దిగాయి.
సాధారణ ఎన్నికలకు రెండున్నరేళ్లకు ముందు స్థానిక సంస్థలు, పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వచ్చే నెల నుంచి వరసగా ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ గ్రాడ్యుయేట్; నెల్లూ రు- చిత్తూరు- ప్రకాశంలో గ్రాడ్యుయేట్, టీచర్; కడప- కర్నూలు- అనంతపురంలో గ్రాడ్యుయేట్,టీచర్ నియోజకవర్గాలకు ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీకి గ్రాడ్యుయేట్, టీచర్ల నియోజకవర్గాలపై పెద్దగా పట్టు లేదు. శాసనమండలి పునరుద్ధరణ తర్వాత జరిగిన ఎన్నికల్లో, ఇప్పటివరకూ గుం టూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి చిగురుపాటి వరప్రసాద్, టీచర్ల నియోజకవర్గం నుంచి రామకృష్ణ మాత్రమే విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో టీచర్-గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజ యం సాధించాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. విద్యాధికులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయుల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ మేరకు సానుకూలత ఉందో ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తాయి. ఒకవేళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించకపోతే అది పార్టీపై వ్యతిరేక ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అదే సమయంలో నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారన్న విమర్శను, వైసీపీ క్షేత్రస్థాయికి తీసుకువెళుతున్నందున, నిరుద్యోగులపై వాటి ప్రభావం ఎంతన్నది ఆసక్తికరంగా మారింది.
అందువల్ల ఆ పార్టీ నాయకత్వం ప్రధాన కార్యదర్శి లోకేష్ నాయకత్వంలో నెలక్రితం నుంచే కసరత్తు ప్రారంభించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ నియోజకర్గాలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. నిరుద్యోగులను ప్రభు త్వం మోసం చేస్తోందంటూ యువభేరి సభలతో పాటు, వివిధ కాలేజీలకు వెళ్లి ప్రభుత్వంపై తిరుగుబాటుకు పురికొల్పుతున్న జగన్‌కు, గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు సవాలుగా పరిణమించాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకూ ఆయన పార్టీ అభ్యర్ధులను ప్రకటించలేదు. దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ కడపలో గోపాల్‌రెడ్డికి మాత్రమే మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది. వామపక్ష అనుబంధ పిడిఎఫ్ మళ్లీ ఉనికిని నిలబెట్టుకునేందు కు ప్రయత్నిస్తోంది. విశాఖ-శ్రీకాకుళం- విజయనగరం గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న ఎంవిఎస్ శర్మ పోటీకి సిద్ధమయ్యారు.
ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న వి.బాలసుబ్రహ్మణ్యం, కడప- కర్నూలు-అనంతపురం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న గేయానంద్ విజయం కోసం శ్రమిస్తున్నారు. అయితే, టీచర్ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న పిడిఎఫ్ అభ్యర్ధులకు వైసీపీ పరోక్ష మద్దతునిస్తున్నట్లు తెలుస్తోంది.

చిత్రం..బాబు-జగన్